Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: ఇంగ్లండ్ శుభారంభం.. క్రొయేషియాపై ఘన విజయం

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. గ్రూప్-ఎల్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ 4-2 గోల్స్ తేడాతో క్రొయేషియా‌ను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో సెకండాఫ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం చెలాయించి తొలి విజయాన్ని అందుకున్నారు.

డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొమ్మిదో నిమిషంలోనే ఇంగ్లండ్‌కు పెనాల్టీ లభించింది. కెప్టెన్ హ్యారీ కేన్ రెండో ప్రయత్నంలో గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే 36వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మార్టిన్ బటురినా సూపర్ గోల్‌తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 42వ నిమిషంలో డెక్లాన్ రైస్ అందించిన కార్నర్ పాస్‌ను కేన్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచి ఇంగ్లండ్‌ను మళ్లీ ముందంజలో నిలిపాడు. కానీ, ఫస్టాఫ్ ఇంజ్యూరీ టైమ్‌లో క్రొయేషియా తరఫున పెటార్ ముసా గోల్ కొట్టడంతో ప్రథమార్ధం 2-2తో ముగిసింది.

FIFA World Cup 2026 Kane s Brace and Bellingham s Brilliance Power England to a Thrilling 4-2 Win Over Croatia

సెకండాఫ్‌ మొదలైన 85 సెకన్లలోనే జూడ్ బెల్లింగ్‌హామ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో ఇంగ్లండ్‌కు 3-2 ఆధిక్యం తెచ్చిపెట్టాడు. క్రొయేషియా గోల్‌కీపర్ డొమినిక్ లివకోవిచ్ పలుమార్లు ఇంగ్లండ్ దాడులను అడ్డుకున్నప్పటికీ, మ్యాచ్ ముగియడానికి ఐదు నిమిషాల ముందు (85వ నిమిషంలో) సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మార్కస్ రాష్‌ఫోర్డ్ నాలుగో గోల్ చేసి ఇంగ్లం విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 22 సార్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై ఇంగ్లండ్ దాటి చేసింది.

ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన హ్యారీ కేన్, ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక గోల్స్ (10 గోల్స్) చేసిన గ్యారీ లినేకర్ రికార్డును సమం చేశాడు. అలాగే డేవిడ్ బెకమ్ తర్వాత మూడు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో (2018, 2022, 2026) గోల్స్ చేసిన రెండో ఇంగ్లీష్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

మరోవైపు, 23 ఏళ్ల వయసు రాకముందే అత్యధిక మేజర్ టోర్నమెంట్ మ్యాచ్‌లు (16) ఆడిన యూరోపియన్ ఆటగాడిగా జూడ్ బెల్లింగ్‌హామ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. డిఫెన్స్‌లోనూ రాణించిన బెల్లింగ్‌హామ్ ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Thursday, June 18, 2026, 10:34 [IST]
Other articles published on Jun 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+