Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026 టోర్నీలో సంచలనం.. ఇరాన్‌ను వణికించిన పసికూన!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ సంచలన ఫలితం నమోదైంది. గ్రూప్ జిలో భాగంగా మంగళవారం జరిగిన న్యూజిలాండ్, ఇరాన్ మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. ఇదే గ్రూప్‌లోని బెల్జియం-ఈజిప్ట్ మ్యాచ్ కూడా 1-1తో డ్రా కావడంతో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు గ్రూప్ టాప్ ప్లేస్ దక్కేది. కానీ పసికూన న్యూజిలాండ్ అనూహ్య రీతిలో చెలరేగి ఇర్‌న్‌కు చుక్కలు చూపించింది.

న్యూజిలాండ్ ఫార్వర్డ్ ప్లేయర్ ఎలిజా జస్ట్ రెండు అద్భుతమైన గోల్స్‌తో మెరవగా.. ఇరాన్ డిఫెండర్ రామిన్ రెజాయన్ ఒక గోల్, ఒక అసిస్ట్‌తో తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు.

రఫ్ఫాడించిన ఎలిజా..

మ్యాచ్ 7వ నిమిషంలోనే కీపర్ నుంచి వచ్చిన లాంగ్ పాస్‌ను కెప్టెన్ క్రిస్ వుడ్ అందుకోగా.. దానిని ఎలిజా జస్ట్ గోల్‌గా మలిచి న్యూజిలాండ్‌కు 1-0తో ఆధిక్యం అందించాడు. అయితే 32వ నిమిషంలో ఇరాన్ ప్లేయర్ రెజాయన్ అవుట్‌సైడ్-ది-బూట్ షాట్‌తో గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు.

FIFA World Cup 2026 Iran and New Zealand Split Points in a Pulse-Pounding 2-2 Draw

సెకండాఫ్‌లో న్యూజిలాండ్ మళ్లీ పుంజుకుంది. 54వ నిమిషంలో జస్ట్-క్రిస్ వుడ్ జోడీ మరో అద్భుత వన్-టు-వన్ పాస్‌తో రెండో గోల్ సాధించి 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ, ఆ ఆనందం 10 నిమిషాలు కూడా నిలవలేదు. 64వ నిమిషంలో రెజాయన్ అందించిన పిన్‌పాయింట్ క్రాస్‌ను మొహమ్మద్ మొహెబ్బి హెడర్ ద్వారా గోల్‌గా మార్చడంతో ఇరాన్ 2-2తో స్కోరును సమం చేసింది. చివరి నిమిషాల్లో ఇరాన్ విజయం కోసం తీవ్రంగా శ్రమించినా.. కివీస్ డిఫెండర్ రియాన్ థామస్ సమయోచితంగా బంతిని క్లియర్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

వరల్డ్ రికార్డ్స్..

ఒకే ప్రపంచ కప్ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా ఎలిజా జస్ట్ రికార్డు సృష్టించాడు.

ఒకే మ్యాచ్‌లో రెండు అసిస్ట్‌లు (గోల్స్ చేయడంలో సహాయం) అందించిన తొలి కివీస్ ప్లేయర్‌గా క్రిస్ వుడ్ నిలిచాడు. గత మూడు వరల్డ్ కప్స్‌లో ఒకే ఆటగాడికి రెండు అసిస్ట్‌లు ఇచ్చిన మూడో ప్లేయర్ క్రిస్ వుడ్ మాత్రమే.

ఇరాన్ తరపున ఒకే వరల్డ్ కప్ మ్యాచ్‌లో గోల్‌తో పాటు అసిస్ట్ అందించిన తొలి ఆటగాడిగా రామిన్ రెజాయన్ రికార్డు నెలకొల్పాడు.

సాధారణ మ్యాచ్‌గా భావించిన ఈ పోరు.. ఆటగాళ్ల వీరోచిత పోరాటంతో లాస్ ఏంజెల్స్ అభిమానులకు అసలైన వరల్డ్ కప్ మజాను అందించింది.

Story first published: Tuesday, June 16, 2026, 10:11 [IST]
Other articles published on Jun 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+