FIFA World Cup 2026: వరల్డ్ కప్ మొదలవ్వగానే కొత్త రగడ.. ఆ దేశ జెర్సీపై నిషేధం!
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నీ జూన్ 11న ఎంతో ఘనంగా ప్రారంభమైంది. అయితే టోర్నమెంట్ మొదలైన కొన్ని రోజుల్లోనే ఓ పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. ఈ మెగా ఈవెంట్‌లో హైతీ దేశ ఫుట్‌బాల్ జట్టు జెర్సీని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) నిషేధించింది. తమ మొదటి మ్యాచ్ ఆడటానికి ముందే జట్టు తన జెర్సీని మార్చాల్సందిగా ఫిఫా కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఫ్లోరిడాలో న్యూజిలాండ్, పెరూ దేశాలతో జరిగిన రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లలో హైతీ ఆటగాళ్లు ఈ వివాదాస్పద జెర్సీని ధరించి మైదానంలోకి దిగారు. ఈ కిట్ డిజైన్‌ను పరిశీలించిన ఫిఫా.. తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని గుర్తించి వెంటనే మార్పులు చేయాలని ఆదేశించింది. దీంతో హైతీ ఫుట్‌బాల్ ఫెడరేషన్, జెర్సీ తయారీ సంస్థ 'సాయేటా' ఆ లోగోలను తొలగించి కొత్త జెర్సీలను సిద్ధం చేశాయి.
వివాదాల గల అసలు కారణం ఏమిటి?
హైతీ జట్టు జెర్సీపై కుడి వైపున ఓ చారిత్రాత్మక యుద్ధానికి సంబంధించిన చిత్రాన్ని ముద్రించారు. 1803లో జరిగిన 'బాటిల్ ఆఫ్ వెర్టియరెస్' యుద్ధం, వారి జాతీయ జెండాకు సంబంధించిన విజువల్స్ ఆ జెర్సీపై ఉన్నాయి. ఈ యుద్ధం హైతీ దేశ స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత కీలకమైనది. ఫ్రాన్స్ దేశ దాస్యం నుంచి విముక్తి పొంది, ప్రపంచంలోనే మొట్టమొదటి స్వతంత్ర నల్లజాతీయుల రిపబ్లిక్‌గా హైతీ అవతరించడానికి ఈ యుద్ధమే కారణం. అయితే ఈ చారిత్రక చిత్రాన్ని జెర్సీపై ఉంచడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిఫా పేర్కొంది.

ఫిఫా నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఫిఫా ఎక్విప్‌మెంట్ నిబంధనల ప్రకారం.. ఆటగాళ్లు ధరించే కిట్స్‌పై ఎలాంటి రాజకీయ, మతపరమైన లేదా వ్యక్తిగత సందేశాలు, చిహ్నాలు, నినాదాలు ఉండకూడదు. క్రీడల్లో రాజకీయ తటస్థతను కాపాడటమే ఫిఫా ముఖ్య ఉద్దేశం. హైతీ జెర్సీపై ఉన్న యుద్ధ చిత్రం రాజకీయ, సైనిక సందేశాన్ని ప్రేరేపించేలా భిన్న అర్థాలకు దారితీసే అవకాశం ఉందని ఫిఫా స్పష్టం చేసింది. ఈ విషయంపై జెర్సీ డిజైన్ చేసిన 'సాయేటా' సంస్థ స్పందిస్తూ.. "మా ఉద్దేశం ఎలాంటి రాజకీయ ప్రకటన చేయడం కాదు. హైతీ దేశ ప్రజల గర్వాన్ని, వారి పట్టుదలను, భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న దేశ ప్రజలను గౌరవించడానికే ఈ డిజైన్ రూపొందించాం. అయినప్పటికీ ఫిఫా నిబంధనలను గౌరవిస్తూ మేము ఆ విజువల్ ఎలిమెంట్స్‌ను తొలగించి, మార్పులు చేసాము" అని అధికారిక ప్రకటనలో తెలిపింది.
52 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లోకి రీ-ఎంట్రీ
దేశంలో తీవ్రమైన అంతర్గత రాజకీయ సంక్షోభం, గ్యాంగ్ హింస సాగుతున్నప్పటికీ, వాటన్నింటినీ అధిగమించి హైతీ జట్టు 2026 ఫిఫా వరల్డ్ కప్‌నకు అర్హత సాధించడం ఓ అద్భుతమైన స్ఫూర్తిదాయక అంశం. 1974 తర్వాత అంటే సుమారు 52 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత హైతీ జట్టు ఫుట్‌బాల్ మహాకుంభంలో అడుగుపెడుతోంది. జూన్ 13, శనివారం నాడు స్కాట్లాండ్‌తో జరగబోయే గ్రూప్-సి మ్యాచ్‌తో హైతీ తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ గ్రూప్‌లో స్కాట్లాండ్‌తో పాటు బలమైన బ్రెజిల్, మొరాకో జట్లు కూడా ఉన్నాయి. జెర్సీ వివాదం పక్కన పెడితే, మైదానంలో ఈ జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హైతీ స్క్వాడ్
వరల్డ్ కప్ కోసం హైతీ జట్టు ఇదే:
| స్థానం | ఆటగాడి పేరు |
| గోల్‌కీపర్ | జోసు डुవెర్గర్, అలెగ్జాండ్రే పియరె, జోనీ ప్లాసైడ్ |
| డిఫెండర్ | రికార్డో ఏడీ, కార్లెన్స్ ఆర్కస్, హేన్స్ డెల్క్రోయిక్స్, జీన్-కెవిన్ డువెర్న్, మార్టిన్ అనుభవ్, డ్యూక్ లాక్రోయిక్స్, గార్వెన్ మెటుసాలా, విల్గుయన్స్ పౌగైన్, కిటో థర్మోన్సీ |
| మిడ్‌ఫీల్డర్ | కార్ల్ ఫ్రెడ్ శాంటే, జీన్-రిక్నర్ బెల్లెగార్డే, డాన్లీ జీన్ జాక్స్, వుడెన్స్కీ పియరె, డొమినిక్ సైమన్ |
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

