Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన అమెరికా.. పరాగ్వేపై ఘన విజయం!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆతిథ్య అమెరికా శుభారంభం చేసింది. శనివారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన అమెరికా 4-1 తేడాతో పరాగ్వేను చిత్తుగా ఓడించింది. స్టార్ స్ట్రైకర్ ఫొలారిన్ బలోగన్ రెండు అద్భుతమైన గోల్స్‌తో అమెరికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో అమెరికా నాలుగు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూ అమెరికా ఈ ఫీట్ సాధించలేదు.

ఆరంభం నుంచే అమెరికా జోరు

మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలోనే అమెరికాకు అదృష్టం కలిసివచ్చింది. పరాగ్వే డిఫెండర్ డామియన్ బొబాడిల్లా సెల్ఫ్ గోల్‌తో అమెరికా 1-0తో ఖాతా తెరిచింది. వెస్టన్ మెక్‌కెన్నీ అందించిన పాస్‌ను బొబాడిల్లా పొరపాటున తన సొంత నెట్‌లోకి పంపాడు. ఆ తర్వాత 31వ నిమిషంలో క్రిస్టియన్ పులిసిక్ అందించిన పాస్‌ను బలోగన్ చక్కటి గోల్‌గా మలిచాడు.

FIFA World Cup 2026 Folarin Balogun Braces as Pochettino s USA Dominate Paraguay 4-1 in Opener

ఫస్టాఫ్ ఇంజూరీ టైమ్‌లో మాలిక్ టిల్‌మన్ ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను బలోగన్ గోల్‌గా మలిచి అమెరికా ఆధిక్యాన్ని 3-0తె ట్రిపుల్ చేశాడు. ప్రపంచకప్ చరిత్రలోనే ఫస్టాఫ్ గేమ్‌లో అమెరికా మూడు గోల్స్ చేయడం ఇదే తొలిసారి.


పుంజుకున్న పరాగ్వే.. కానీ,

సెకండాఫ్‌లో పరాగ్వే పుంజుకోవడానికి ప్రయత్నించింది. 73వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మారిసియో గోల్ చేయడంతో పరాగ్వే ఖాతా తెరిచింది. అయితే.. మ్యాచ్ ముగిసే సమయానికి (ఇంజురీ టైమ్ 8వ నిమిషంలో) అమెరికా ఆటగాడు గియోవన్నీ రేనా ఒక అద్భుతమైన 'త్రివెల' ఫినిష్‌తో నాలుగో గోల్ అందించి పరాగ్వే ఓటమిని ఖాయం చేశాడు.

నమోదైన రికార్డ్స్..

అమెరికా సీనియర్ ప్లేయర్ టీమ్ రీమ్ ప్రపంచకప్‌లో తమ దేశం తరపున ఆడిన అత్యంత వృద్ధ ఆటగాడిగా నిలిచాడు. 38 ఏళ్ల 250 రోజుల వయసులో అతను ఈ మ్యాచ్ ఆడాడు.

ఫాస్టెస్ట్ గోల్: మ్యాచ్ ప్రారంభమైన 6 నిమిషాల 48 సెకన్లకే అమెరికా గోల్ సాధించింది. ప్రపంచకప్ చరిత్రలోనే ఆతిథ్యం దేశం తమ తొలి మ్యాచ్‌లో సాధించిన అత్యంత వేగవంతమైన మూడో గోల్ ఇది.

బలోగన్ రికార్డు: 1930లో పరాగ్వేపై బెర్ట్ పటేనాడ్ తర్వాత, ప్రపంచకప్ మ్యాచ్‌లో ఒకటి కంటే ఎక్కువ గోల్స్ చేసిన రెండో అమెరికన్ ఆటగాడిగా బలోగన్ రికార్డు సృష్టించాడు.

Story first published: Saturday, June 13, 2026, 10:18 [IST]
Other articles published on Jun 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+