FIFA World Cup 2026 Final: ఈ రాత్రి ఫుట్‌బాల్ మహా సంగ్రామం.. కప్పెవరిది?
FIFA World Cup 2026 Final: కోట్ల మంది నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ రోజు రాత్రి స్పెయిన్, అర్జెంటీనాల మధ్య బ్లాక్‌బస్టర్ ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ జరగనుంది. లియోనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా జట్టు వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ స్పెయిన్ డిఫెన్స్‌ను మెస్సీ ఛేదించగలడా అనేదే అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్లను ఓడించగలమని స్పెయిన్ ఇప్పటికే నిరూపించుకుంది. సెమీ-ఫైనల్స్‌లో కిలియన్ ఎంబాపే, ఉస్మాన్ డెంబెలె, మైఖేల్ ఒలిసెహ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న ఫ్రాన్స్ జట్టును కూడా స్పెయిన్ ఓడించింది. ఉనై సిమోన్, స్పెయిన్ డిఫెన్స్ ఈ ప్రపంచ కప్‌లో తమ నాలుగో క్లీన్ షీట్‌ను నమోదు చేశాయి. దీంతో ఒకే ప్రపంచ కప్ సీజన్‌లో ఆరు క్లీన్ షీట్‌లు సాధించిన తొలి జట్టుగా స్పెయిన్ నిలిచింది.
కానీ మరోవైపు ఈ ప్రపంచ కప్‌లోనే బెస్ట్ ప్లేయర్ గా పరిగణించబడే లియోనెల్ మెస్సీ ఉన్నాడనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. టోర్నీ ప్రారంభం నుంచే లియోనెల్ మెస్సీ గోల్స్ చేయడం ప్రారంభించాడు. మెస్సీ మొదటి మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి.. ఆపై రెండో మ్యాచ్‌లో మరో రెండు గోల్స్ చేసి ప్రపంచ కప్ లో అత్యధిక గోల్స్ చేసిన మిరోస్లావ్ క్లోస్ రికార్డును అధిగమించాడు. స్పానిష్ డిఫెన్స్ ఛేదించడానికి ఓ అద్భుత క్షణం కావాలి. ప్రపంచంలో అలాంటి అద్భుతం చేయగల గొప్ప సామర్థ్యం ఉన్న ఆటగాడు ఒక్కడే ఉన్నాడంటే.. అది మెస్సీనే. ఈ రోజు మెస్సీ తన గోల్స్, గోల్డెన్ బూట్, ఫిఫా వరల్డ్ కప్ ట్రీఫీతో ముగింపు పలకాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్
2018 ప్రపంచ కప్‌కు ముందు స్పెయిన్, అర్జెంటీనా చివరిసారిగా ఓ స్నేహపూర్వక మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో మెస్సీ లేకపోవడంతో స్పెయిన్, అర్జెంటీనాను 6-1 తేడాతో ఓడించింది. ఇదిలా ఉండగా.. ఈ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆడుతున్న చాలా మంది ఆటగాళ్లకు ఒకరితో ఒకరికి మంచి పరిచయం ఉంది, ఎందుకంటే ఇరు జట్లలోని 52 మంది ఆటగాళ్లలో 24 మంది స్పానిష్ లీగ్ అయిన లా లిగాలో ఆడతారు. వీరిలో 18 మంది స్పెయిన్‌కు చెందినవారు కాగా.. ఆరుగురు అర్జెంటీనాకు చెందినవారు. స్పెయిన్ జట్టులోని లామిన్ యమాల్‌తో సహా 8 మంది బార్సిలోనా ఆటగాళ్లు, చిన్నప్పుడు క్యాంప్ నౌలో లియోనెల్ మెస్సీ ఆటను చూశారు. వీరిలో బార్సిలోనాలో ఉన్న సమయంలో మిడ్‌ఫీల్డర్ పెడ్రి మాత్రమే మెస్సీతో ఒకే మైదానంలో ఆడే అవకాశం పొందాడు.
ఈ రెండు జట్లు ప్రపంచ కప్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఆ మ్యాచ్ 1966లో ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో జరిగింది, అక్కడ గ్రూప్ దశలోని మొదటి మ్యాచ్‌లో అర్జెంటీనా స్పెయిన్‌ను 2-1 తేడాతో ఓడించింది. మెస్సీ తన క్లబ్ కెరీర్‌లో ఎక్కువ భాగం స్పెయిన్‌లోని బార్సిలోనా తరపున ఆడాడు. స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా తమ జాతీయ జట్టు తరపున ఆడమని అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించింది, కానీ విఫలమైంది. మరోవైపు ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా యూరప్ డిఫెండింగ్ ఛాంపియన్ (స్పెయిన్), దక్షిణ అమెరికా డిఫెండింగ్ ఛాంపియన్ (అర్జెంటీనా) ప్రపంచ కప్ ఫైనల్‌లో తలపడనున్నాయి.
ఇరు జట్లు అంచనా:
అర్జెంటీనా : మార్టినెజ్ (గోల్ కీపర్), లియోనెల్ మెస్సీ, తలియాఫికో, లిసాండ్రో, మోలినా, రొమెరో, లియాండ్రో, రోడ్రిగో, మాక్ అలిస్టర్, ఫెర్నాండెజ్, అల్వారెజ్.
స్పెయిన్ : ఉనై సిమోన్(గోల్ కీపర్), పెడ్రో, కుబర్సి, లాపోర్టే, కుకుర్రియా, రోడ్రి, పెద్రి, ఓల్మో, బెనా, యమాల్, ఒయర్సబల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

