Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA WC 2026: క్రిస్టియానో రొనాల్డోకు నిరాశ.. వరల్డ్ కప్‌లో కొలంబియా సంచలనం!

FIFA WC 2026: ఫిఫా ప్రపంచ కప్ 2026 గ్రూప్ కెలో భాగంగా కొలంబియా, పోర్చుగల్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు 0-0తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ హోరాహోరీగా సాగినప్పటికీ ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. అయితే ఈ డ్రాతో కొలంబియా గ్రూప్ టాపర్‌గా నిలిచి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ సెకండాఫ్ స్టాపేజ్ టైమ్(91వ నిమిషం)లో కొలంబియా ఆటగాడు డావిన్సన్ సాంచెజ్ అద్భుత హెడర్‌తో గోల్ చేసి సంబరాల్లో మునిగిపోయాడు. కానీ దురదృష్టవశాత్తూ రెఫరీ దానిని 'ఆఫ్‌సైడ్'గా ప్రకటించడంతో కొలంబియా విజయం చేజారింది.

మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. తొలి నాలుగు నిమిషాల్లోనే కొలంబియా ఆటగాడు జాన్ అరియాస్ హెడర్ మిస్ చేయగా.. పోర్చుగల్ స్టార్ రూబెన్ నెవెస్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌కు దూరంగా వెళ్లింది. ఆ తర్వాత కొలంబియా ప్లేయర్ జాన్ కార్డోబా, పోర్చుగల్ కీపర్ డియోగో కోస్టాను పరీక్షిస్తూ ఓ పవర్‌ఫుల్ షాట్ కొట్టాడు. అయితే కోస్టా దాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నాడు. మరోవైపు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫ్రీ-కిక్ ద్వారా గోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. కొలంబియా కీపర్ కామిలో వర్గాస్ దాన్ని సులువుగా ఆపేశాడు. ఫస్టాఫ్ ముగిసే సమయానికి జేమ్స్ రోడ్రిగ్జ్ కొట్టిన లో-ఫిజ్జర్ షాట్‌ను కోస్టా అడ్డుకోవడంతో స్కోరు 0-0గానే నిలిచింది.

FIFA World Cup 2026 Colombia Top Group K After Thrilling 0-0 Draw Against Portugal Full Details

సెకండాఫ్‌లో కూడా కొలంబియా ఒత్తిడిని కొనసాగించింది. జేమ్స్ రోడ్రిగ్జ్ మిడ్‌ఫీల్డ్ నుంచి అద్భుతమైన పాస్‌లతో జట్టును నడిపించాడు. రిచర్డ్ రియోస్, అరియాస్, గుస్తావో ప్యూర్టాలకు గోల్ చేసే అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వారు చేజార్చుకున్నారు. మ్యాచ్ చివరి నిమిషాల్లో లూయిస్ సువారెజ్ కొట్టిన షాట్ బార్ పైనుంచి వెళ్ళిపోయింది. చివరి నిమిషంలో సాంచెజ్ చేసిన గోల్ ఆఫ్‌సైడ్ కావడం, ఆ వెంటనే పోర్చుగల్ ప్లేయర్ రాఫెల్ లెయావోకు వచ్చిన సులువైన అవకాశం మిస్ అవ్వడంతో ఇరు జట్లు పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో కొలంబియా దూకుడుగా ఆడినప్పటికీ గోల్స్ చేయలేకపోవడం వారిని కొంత నిరాశకు గురిచేసింది. అయితే ఈ మ్యాచ్‌లో వారు సరికొత్త రికార్డులు సృష్టించారు. 21వ శతాబ్ధంలో వరల్డ్ కప్ మ్యాచ్ రికార్డుల్లో.. తొలి రెండు నిమిషాల్లోనే రెండుసార్లు గోల్స్ కోసం ప్రయత్నించడం కొలంబియాకు ఇదే మొదటిసారి. ఫస్ట్ హాఫ్‌లోనే వారు ఏకంగా 12 సార్లు గోల్ కోసం ప్రయత్నించి పోర్చుగల్ డిఫెన్స్‌కు చుక్కలు చూపించారు.

మరోవైపు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఇది 25వ వరల్డ్ కప్ మ్యాచ్. గత మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై రెండు గోల్స్‌తో మెరిసిన రొనాల్డో.. ఈ మ్యాచ్‌లో మాత్రం కేవలం 35 టచ్‌లు, 3 షాట్లతో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. కాగా కొలంబియా కెప్టెన్ జేమ్స్ రోడ్రిగ్జ్ వరల్డ్ కప్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన మొదటి కొలంబియన్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 5 గోల్ అవకాశాలను సృష్టించడమే కాకుండా, ప్రత్యర్థి బాక్స్‌లో అత్యధికంగా 43 పాస్‌లు ఇచ్చి జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా నిలిచాడు.

గ్రూప్ 'కె' లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న కొలంబియా.. జులై 3న జరిగే రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఘనాతో తలపడనుంది. అలాగే గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన పోర్చుగల్ జట్టు క్రొయేషియాతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ పోర్చుగల్ ఈ రౌండ్ దాటితే, లాస్ట్ 16లో స్పెయిన్ లాంటి బలమైన జట్టుతో తలపడే అవకాశం ఉంది.

Story first published: Sunday, June 28, 2026, 9:39 [IST]
Other articles published on Jun 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+