Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA WC 2026: 24 ఏళ్ల నిరీక్షణ.. టర్కీని ముంచేసిన ఆస్ట్రేలియా వ్యూహం!

FIFA WC 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నీలో సరికొత్త సంచలనం నమోదైంది. వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్-డి హోరాహోరీ పోరులో ఆస్ట్రేలియా జట్టు 2-0 గోల్స్ తేడాతో బలమైన టర్కీ జట్టును మట్టికరిపించింది. సుదీర్ఘమైన 24 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రపంచ కప్ బరిలోకి దిగిన టర్కీ జట్టుకు ఆస్ట్రేలియా పక్కా వ్యూహాలు, డిఫెన్స్‌తో ఊహించని షాకిచ్చింది. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. అద్భుతమైన వ్యూహం ముందు జట్టు నిలబడలేదని ఈ మ్యాచ్ నిరూపించింది.

ఆస్ట్రేలియా, టర్కీ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైన 27వ నిమిషంలోనే ఆస్ట్రేలియా గోల్ కీపర్ పాట్రిక్ బీచ్ అందించిన పాస్‌ను మిడ్‌ఫీల్డర్ పాల్ ఓకాన్ అద్భుతంగా ఫార్వర్డ్ చేయగా.. 20 ఏళ్ల నెస్టోరీ ఇరాన్‌కుందా మ్యాచ్ 27వ నిమిషంలో మెరుపు వేగంతో టర్కీ డిఫెన్స్‌ను దాటుకుంటూ వెళ్లి తొలి గోల్ సాధించాడు. దీనితో ఫిఫా వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా తరఫున గోల్ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా ఇరాన్‌కుందా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత టర్కీ ప్లేయర్లు ఆటగాళ్లు మ్యాచ్ ను డ్రా చేయడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆస్ట్రేలియా డిఫెన్స్ దాన్ని తిప్పికొట్టింది.

FIFA World Cup 2026 Australia Pulls Off Major Upset Beats Turkiye 2-0 With Tactical Masterclass

ఇక మ్యాచ్ 75వ నిమిషంలో టర్కీ మిడ్‌ఫీల్డర్ ఐటాచ్ యుక్సెక్ చేసిన చిన్న పొరపాటును ఆస్ట్రేలియా ప్లేయర్ కానర్ మెట్‌కాఫ్ చక్కగా ఉపయోగించుకున్నాడు. బంతిని లాక్కొని పెనాల్టీ బాక్స్ వెలుపల నుండి లో-స్ట్రైక్ ద్వారా బంతిని నెట్ లోకి పంపి ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 2-0 కు పెంచాడు. అక్కడ నుండి టర్కీ ఎంత ప్రయత్నించినా ఆస్ట్రేలియా డిఫెన్స్ లైన్ లొంగలేదు. ఎత్తు మాత్రమే కాకుండా.. జట్టు కృషి, వ్యూహాత్మక అమలుతో ఆస్ట్రేలియా ఈ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

టర్కీకి శాపంగా మారిన ఆస్ట్రేలియా ఆటగాళ్ల పొడవు?
ఈ మ్యాచ్ లో టర్కీ పరాజయానికి ప్రధాన కారణం ఆస్ట్రేలియా ఆటగాళ్ల శారీరక దృఢత్వం.. ముఖ్యంగా వారి ఎత్తు. టర్కీ ఫార్వర్డ్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా పెనాల్టీ ఏరియాలోకి వెళ్లిన ప్రతిసారీ ఓ పెద్ద గోడ ఎదురైనట్లు అనిపించింది. దీనిపై మ్యాచ్ అనంతరం టర్కీ కోచ్ విన్సెంజో మోంటెల్లా మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియా డిఫెండర్లు చాలా పొడవుగా ఉన్నారు. అందుకే మాకు గోల్స్ చేయడం చాలా కష్టంగా మారింది" అని తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. టర్కీ అటాకింగ్ విభాగంలో ఉన్న కెరెమ్ అక్తుర్కోగ్లు, ఓర్కున్ కోక్చు వంటి ఆటగాళ్లు 5.8 అడుగుల ఎత్తు ఉండగా.. ఆస్ట్రేలియా డిఫెండర్లు 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుతో గాల్లోకి వచ్చే ప్రతి బంతిని అడ్డుకున్నారు.

Story first published: Sunday, June 14, 2026, 16:17 [IST]
Other articles published on Jun 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+