Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రకృతి విపత్తు కలకలం.. ఉలిక్కిపడ్డ రొనాల్డో సేన!

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు చెందిన పోర్చుగల్ జట్టు క్యాంప్ సమీపంలో భారీ భూకంపం సంభవించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఈ శిక్షణ శిబిరానికి సమీపంలో ఒక్కసారిగా 6.1 తీవ్రతతో భూమి కంపించడంతో ఆటగాళ్లతో పాటు అక్కడి సహాయక సిబ్బంది అంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓ వైపు ప్రతిష్టాత్మక ప్రపంచకప్ కోసం ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ఈ ప్రకృతి విపత్తు ఒక్కసారిగా కలకలం రేపింది.

అయితే ఈ ప్రమాదం నుంచి రొనాల్డోతో పాటు పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు సభ్యులంతా సురక్షితంగా బయటపడటంతో అభిమానులు, క్రీడాలోకం ఊపిరి పీల్చుకుంది. ఈ భూకంప కేంద్రం పశ్చిమ క్యూబా సముద్ర గర్భంలో ఉన్నప్పటికీ.. దాని తీవ్రమైన ప్రకంపనలు సౌత్ ఫ్లోరిడా, మియామి, ఆర్లాండో వరకు స్పష్టంగా కనిపించాయి. ప్లామ్ బీచ్ గార్డెన్స్ పరిధిలోని నార్త్ కౌంటీ డిస్ట్రిక్ట్ పార్క్‌లో ఏర్పాటు చేసిన పోర్చుగల్ బేస్ క్యాంప్‌పై దీని ప్రభావం ఏమీ పడలేదని, ఆటగాళ్లెవరినీ వేరే ప్రాంతానికి తరలించాల్సిన అవసరం రాలేదని అధికారులు స్పష్టం చేశారు.

FIFA World Cup 2026 6 1 Earthquake Near Cristiano Ronaldo Portugal World Cup Camp In Florida Team Safe

ఈ భూకంపం వల్ల సముద్రంలో సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని వాతావరణ, భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పోర్చుగల్ జట్టు తమ ప్రాక్టీస్‌ను యథావిధిగా కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా టెక్సాస్‌లోని హ్యూస్టన్ నగరంలో ఉన్న ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో జరగబోయే గ్రూప్-కె తొలి మ్యాచ్ కోసం రొనాల్డో సేన సన్నద్ధమవుతోంది. గత ప్రపంచకప్‌లో మొరాకో చేతిలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయినందున ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే పట్టుదలతో జట్టు ఉంది.

క్యాంప్ సురక్షితంగా ఉన్నప్పటికీ.. ఫ్లోరిడా, క్యూబా ప్రాంతాల్లో మాత్రం ఈ భూకంపం పెద్ద ఎత్తున అల్లకల్లోలం సృష్టించింది. మియామి-డేడ్ కౌంటీలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఎత్తైన భవనాలను అధికారులు హెచ్చరికగా తక్షణమే ఖాళీ చేయించారు. కొన్ని మెట్రో రైళ్లను కూడా భద్రతా తనిఖీల కోసం కాసేపు నిలిపివేశారు. భవనాలు, హోటళ్లు ఒక్కసారిగా ఊగిపోవడంతో పర్యాటకులు, స్థానిక ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. టేబుళ్లపై ఉన్న సామాన్లు కిందపడిపోవడంతో కాసేపు అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది.

ఈ ఘటనపై యూఎస్ జియోలాజికల్ సర్వే(USGS) సైంటిస్ట్ విలియం బర్న్‌హార్ట్ మాట్లాడుతూ.. గల్ఫ్ తీర ప్రాంతంలో ఇంతటి భారీ స్థాయిలో భూకంపం రావడం అత్యంత అరుదైన విషయమని పేర్కొన్నారు. ఆధునిక చరిత్రలో ఈ ప్రాంతంలో 5 అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూమి కంపించడం కేవలం ఐదారు సార్లు మాత్రమే నమోదైందని తెలిపారు. అయితే ఫ్లోరిడా పరిసరాల్లో మళ్లీ తదుపరి భూప్రకంపనలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని, కాబట్టి పుర్తగల్ జట్టు ఎలాంటి ఆందోళన లేకుండా తమ వరల్డ్ కప్ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టవచ్చని ఆయన భరోసా ఇచ్చారు.

Story first published: Tuesday, June 9, 2026, 19:02 [IST]
Other articles published on Jun 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+