Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: రక్తం ఒక్కటే.. జెండాలు వేరే! ఫిఫా వరల్డ్ కప్‌లో విచిత్రం!

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ మహాసమరంలో మొత్తం 48 జట్లు తలపడుతుండగా.. ఫుట్‌బాల్ అభిమానులను ఆకట్టుకునే విశేషం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సారి టోర్నమెంట్‌లో మొత్తం 7 అన్నదమ్ముల జోడీలు బరిలోకి దిగుతున్నారు. ఇందులో 3 జంటలు ఒకే దేశం తరఫున ఆడుతుండగా.. మిగిలిన 4 అన్నదమ్ముల జోడీలు వేర్వేరు దేశాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ చరిత్ర సృష్టించబోతున్నారు. ఒకే రక్తం పంచుకుని పుట్టి.. ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచ కప్ టోర్నీలో భిన్న దేశాల జెండాల కింద ఆడబోతున్న ఆ నాలుగు అన్నదమ్ముల జోడీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.బ్రయాన్ బ్రాబీ, డెరిన్ లుకాసెన్(నెదర్లాండ్స్ & ఘనా)
ఈ సోదరుల తల్లిదండ్రులు ఘనా దేశానికి చెందినవారు. అయితే 30 ఏళ్ల సెంటర్ బ్యాక్ డిఫెండర్ అయిన డెరిక్ లుకాసెన్ ఈ ప్రపంచ కప్‌లో ఘనా జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. గాయపడిన మరొక ఆటగాడి స్థానంలో డెరిక్‌కు ఈ అవకాశం దక్కింది. కాగా అతని తమ్ముడు 24 ఏళ్ల స్ట్రైకర్ బ్రయాన్ బ్రాబీ నెదర్లాండ్స్ (డచ్) జట్టు తరఫున మైదానంలోకి దిగబోతున్నాడు.

FIFA World Cup 2026 4 Brothers Pairs to Play for Different Countries in Football World Cup Details

2.జాన్ సౌటార్, హ్యారీ సౌటారా(స్కాట్లాండ్, ఆస్ట్రేలియా)
జాన్ సౌటార్, హ్యారీ సౌటార్ సోదరులిద్దరూ స్కాట్లాండ్‌లోనే జన్మించారు. విశేషమేమిటంటే వీరిద్దరూ డిఫెండర్లుగానే రాణిస్తున్నారు. వీరి తండ్రి స్కాట్లాండ్‌కు చెందినవాడు కాగా.. తల్లి ఆస్ట్రేలియాలో జన్మించింది. ఈ కారణంగా ఇద్దరికీ రెండు దేశాల తరఫున ఆడే అర్హత లభించింది. ఇప్పుడు అన్న జాన్ సౌటార్ స్కాట్లాండ్ జట్టుకు ఆడుతుండగా.. తమ్ముడు హ్యారీ సౌటార్ ఆస్ట్రేలియా జట్టు తరఫున ప్రపంచ కప్‌లో తలపడనున్నాడు.

3. నికో విలియమ్స్, ఇనాకి విలియమ్స్ (స్పెయిన్ & ఘనా)
ఫుట్‌బాల్ ప్రపంచంలో ఈ సోదరుల జోడీకి మంచి గుర్తింపు ఉంది. 23 ఏళ్ల నికో విలియమ్స్ స్పెయిన్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు, అతడు 2024 యూరో కప్ గెలిచిన స్పెయిన్ జట్టులో సభ్యుడు. ఇక అతని అన్నయ్య 31 ఏళ్ల ఇనాకి విలియమ్స్ 2016లో స్పెయిన్ తరఫున అరంగేట్రం చేసినప్పటికీ.. 2022 నుంచి తన పూర్వీకుల దేశమైన ఘనా తరఫున ఆడుతున్నాడు. క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం వీరిద్దరూ 'అథ్లెటిక్ బిల్బావో' అనే ఒకే క్లబ్ కోసం ఆడటం విశేషం.

4. డెసిరే డౌయ్, గుయెలా డౌయ్ (ఫ్రాన్స్ & ఐవరీ కోస్ట్)
ప్రస్తుతం పీఎస్‌జీ (PSG) క్లబ్‌కు వింగర్‌గా ఆడుతున్న 21 ఏళ్ల డెసిరే డౌయ్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన యువ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఈ ఫిఫా ప్రపంచ కప్‌లో అతడు ఫ్రాన్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. కాగా అతని పెద్దన్న గుయెలా డౌయ్ ఐవరీ కోస్ట్ (ఐవరీ కోస్ట్) దేశం తరఫున ఆడబోతున్నాడు. వీరి తండ్రి ఐవరీ కోస్ట్‌కు, తల్లి ఫ్రాన్స్‌కు చెందిన వారు కావడంతో ఇద్దరు సోదరులకు రెండు దేశాల పౌరసత్వం ఉంది.

ఒకే దేశానికి ఆడుతున్న మిగతా సోదరులు
ఫ్రాన్స్ తరఫున థియో హెర్నాండెజ్ - లూకాస్ హెర్నాండెజ్, కురాకో దేశం తరఫున జునిన్హో బాకునా - లియాండ్రో బాకునా, కేప్ వర్డే దేశం తరఫున డెరాయ్ డువార్టే - లారోస్ డువార్టేలు ఒకే జట్టులో కలిసి ఆడుతున్నారు. నెదర్లాండ్స్ తరఫున ఆడాల్సిన జూరియన్ టింబర్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో అతని సోదరుడు క్వింటన్ టింబర్ మాత్రమే బరిలో ఉన్నాడు.

Story first published: Thursday, June 11, 2026, 9:28 [IST]
Other articles published on Jun 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+