Fifa World Cup 2022: ఈ ఏడాది మొదటి డ్రా.. 1958 తర్వాత వరల్డ్ కప్‌లో తొలి గోల్ చేసిన వేల్స్!

ఫిఫా వరల్డ్ కప్ 2022లో తొలి డ్రా మ్యాచ్ నమోదైంది. యూఎస్ఏ, వేల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండు జట్లు చెరో గోల్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ తొలి అర్థభాగంలోనే యూఎస్ఏ క్రీడాకారుడు టిమ్ వీ తొలి గోల్ చేశాడు. టిమ్ తండ్రి ప్రస్తుతం లిబేరియన్ అధ్యక్షుడు కావడం గమనార్హం. గతంలో అతను ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఉన్నారు.
ఆట ఆరంభమైన 36వ నిమిషంలో క్రిస్టియన్ పులిసిక్ నుంచి పాస్ అందుకున్న టిమ్.. దాన్ని గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత రెండు జట్లు గోల్స్ చేసేందుకు ప్రయత్నించాయి. కానీ ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. అయితే ఆట దాదాపు ముగిసిందని అనుకుంటుండగా.. 82వ నిమిషంలో వేల్స్ సారధి గారెత్ బేల్‌కు పెనాల్టీ దక్కింది. యూఎస్ఏ డిఫెండర్ వాకర్ జిమ్మర్‌మాన్ ఫౌల్ చేయడంతో అతనికి అవకాశం దక్కింది.

దీన్ని అతను గోల్‌గా మలచడంతో వేల్స్ జట్టు.. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. బేల్ ఇప్పటి వరకు 109 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన బేల్‌కు ఇది 41వ అంతర్జాతీయ గోల్. 1958 తర్వాత ఫిఫా ప్రపంచకప్‌లో వేల్స్ తరఫున నమోదైన తొలి గోల్ కావడం ఇదే కావడం గమనార్హం.
తమ తదుపరి మ్యాచ్‌లో యూఎస్ఏ జట్టు ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్ జట్టు తాజాగా ఇరాన్‌పై 6-2 తేడాతో ఘనవిజయం సాధించింది. ఇలాంటి బలమైన జట్టుతో యూఎస్ఏ జట్టు ఎలా ఆడుతుందో చూడాలి. యూఎస్ఏ జట్టుకు ఇది 750వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్ ఆడిన జట్టులో పది మంది ఆటగాళ్లు యూరప్ క్లబ్బులకు చెందిన వారే కావడం గమనార్హం. జిమ్మర్‌మాన్ ఒక్కడే మేజర్ లీగ్ సాకర్ ఆటగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications