For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు ఎవరు..? మెస్సీ ఆ రికార్డ్‌ను టచ్ చేయగలడా..?

FIFA world cup 2022:Who scored the highest individual goals in FIFA world cup-will Messi touch the record

ప్రస్తుతం ప్రపంచం ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఫిఫా ఫుట్‌బాల్ 2022 ఫైనల్స్ డిసెంబర్ 18న జరుగుతుంది. అర్జెంటీనా - ఫ్రాన్స్ జట్లు ఫైనల్స్‌లో తలపడుతున్నాయి. ఇక రెండు జట్లు స్టార్ ప్లేయర్స్‌తో బలోపేతంగా కనిపిస్తున్నాయి. గోల్డెన్ బూట్ అవార్డు రేసులో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ, ఫ్రాన్స్ నుంచి ఎంబాపేలు రేసులో ఉన్నారు. ఇద్దరి ఖాతాలో చెరో ఐదేసి గోల్స్ ఉన్నాయి. అయితే ఫైనల్స్‌లో ఎవరు మ్యాజిక్ చేస్తే వారినే గోల్డెన్ బూట్ అవార్డు వరించే అవకాశం ఉంది. ఇదంతా అటుంచితే ఇప్పటి వరకు ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ ఎవరు వేశారు ఎప్పుడు వేశారనే అంశాన్ని పరిశీలిద్దాం.

ఒక ఫిఫా వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్ వేసిన ఆటగాడి గురించి తెలుసుకోవాలంటే 1958వ సంవత్సరానికి వెళ్లాల్సిందే. 1958లో తొలిసారిగా బ్రెజిల్ ఫిఫా వరల్డ్‌కప్‌ను గెల్చుకుంది. అయితే అత్యధిక గోల్స్ చేసిన వ్యక్తిగా ఫ్రాన్స్‌ ఆటగాడు జస్ట్ ఫాన్‌టెయిన్ నిలిచాడు. టోర్నమెంట్‌లో మొత్తం 13 గోల్స్ స్కోర్ చేశాడు. ఇప్పటికైతే అత్యధిక వ్యక్తిగత గోల్స్ చేసిన వ్యక్తిగా ఫాంటెయిన్ నిలుస్తాడు. ఎందుకంటే ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఇటు మెస్సీ అటు ఎంబాపేలు చెరో 5 గోల్స్‌తో సమానంగా నిలిచారు.

FIFA world cup 2022:Who scored the highest individual goals in FIFA world cup-will Messi touch the record

ఫాంటెయిన్‌ రికార్డును దాటాలంటే ఇద్దరూ చెరో 9 గోల్స్ సాధించాలి. అది అసాధ్యం. ఇక హంగేరీకి చెందిన కాక్‌సిస్ 1954 ఫిఫా వరల్డ్ కప్‌లో 11 గోల్స్ స్కోర్ చేశాడు. జర్మనీకి చెందిన గెర్డ్ ముల్లర్ 10 గోల్స్‌ను 1970 ఫిఫా వరల్డ్ కప్‌లో చేశాడు. ఇప్పటి వరకు ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో వ్యక్తిగతంగా రెండంకెల గోల్స్‌ను సాధించింది ఫాంటెయిన్, కాక్‌సిస్, ముల్లర్‌లు మాత్రమే.

1930లో తొలి ఫిఫా ప్రపంచ కప్ జరిగింది. జూలై 13 నుంచి 30 జూలై వరకు ఈ మెగా టోర్నీ జరిగింది. ఉరుగ్వే తొలి రాజ్యాంగం అమలు చేసి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరల్డ్ కప్‌ను ఆ దేశంలో నిర్వహించారు. 1928 సమ్మర్ ఒలింపిక్స్ లో ఛాంపియన్‌గా అవతరించిన ఉరుగ్వే అదే జోష్‌తో సొంతగడ్డపై వరల్డ్‌కప్‌ బరిలోకి దిగింది. మొత్తం 13 జట్లు పాల్గొన్న ఈ టోర్నీకి రాజధాని మోన్‌టెవీడియో వేదికగా నిలిచింది. మెజార్టీ మ్యాచ్‌లు ఎస్టాడియో సెంటెనారియోలో జరిగాయి. మెగా టోర్నీ కోసమే ఈ ఫుట్‌బాల్ స్టేడియంను నిర్మించారు.

FIFA world cup 2022:Who scored the highest individual goals in FIFA world cup-will Messi touch the record

అప్పట్లో ఐరోపాలో ఏర్పడిన గ్రేట్ డిప్రెషన్‌తో చాలా తక్కువ జట్లు మాత్రమే ఈ వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఆసక్తి చూపాయి. దక్షిణ అమెరికాకు ప్రయాణించే స్తోమత లేకపోవడంతో కొన్ని జట్లు ఈ టోర్నీకి దూరమయ్యాయి. అర్జెంటీనా ఉరుగ్వే జట్లు ఫైనల్స్‌లో తలపడగా ఆతిథ్య దేశం ఉరుగ్వే తొలి ఫిఫా వరల్డ్ కప్‌ను ముద్దాడింది. ఫైనల్స్‌లో ఉరుగ్వే జట్టు అర్జెంటీనా పై 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు 68,346 మంది ప్రేక్షకులు వచ్చారు. మరి డిసెంబర్ 18న జరిగే ఫిఫా వరల్డ్ కప్ -2022 ఫైనల్స్‌కు ఎంతమంది ప్రేక్షకులు హాజరవుతారో చూడాలి.

Story first published: Thursday, December 15, 2022, 20:07 [IST]
Other articles published on Dec 15, 2022
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+