
ఫిఫా వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంటోంది. ఫ్రాన్స్ అర్జెంటీనా దేశాలు డిసెంబర్ 18వ తేదీన ఫైనల్స్‌లో తలపడనున్నాయి.అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ చివరిసారిగా ఆ దేశ జెర్సీతో బరిలో దిగనున్నాడు.ఈ మెగా ఫైనల్‌కు వేదికగా లుసాయిల్ ఐకానిక్ స్టేడియం నిలుస్తోంది.మెస్సీ అర్జెంటీనా జట్టులో ఉన్నప్పటి నుంచి వరల్డ్ కప్ గెలవాలన్న కల కలలానే మిగిలిపోయింది. అయితే తన చివరి మ్యాచ్‌లోనైనా సరే అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్ కానుకగా ఇవ్వాలనే కసితో ఉన్నాడు.
ఇదిలా ఉంటే మరోవైపు ఫ్రాన్స్ జట్టు చాలా బలోపేతంగా కనిపిస్తోంది. ఫైనల్స్‌కు చేరుకునే క్రమంలో ప్రత్యర్థులను మట్టికరిపించిన తీరు చూస్తే ఔరా అనక ఉండలేరు. వారు కనబర్చిన ఆటతీరు ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది.మొరాకోతో జరిగిన సెమీఫైనల్స్‌లో మాత్రం ఫ్రాన్స్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఫ్రాన్స్ డిఫెన్స్ కాస్త బలహీనపడినట్లుగా కనిపించింది.అయినప్పటికీ మేనేజ్ చేసి 2-0తో ఆఫ్రికా జట్టుపై నెగ్గి ఫైనల్స్‌కు చేరుకుంది.ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు టోర్నమెంట్‌లో గోల్డెన్ బూట్ అవార్డు ఎవరికి దక్కుతుందా అనే చర్చ మొదలైంది.

ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియాన్ ఎంబాపే మొరాకో పై ఆడిన సెమీఫైనల్స్‌లో గోల్స్ స్కోర్ చేయలేదు.దీంతో గోల్డెన్ బూట్ రేసులో ఎవరు గెలుస్తారా అనే అంశం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.ప్రస్తుతం ఎంబాపే-మెస్సీ ఇద్దరూ 5 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ రేసులో ఉన్నారు. ఇటు ఫ్రాన్స్ అటు అర్జెంటీనా జట్లు ఫైనల్స్‌లో తలపడుతుండటంతో గోల్డెన్ బూట్ ఎవరు వశం చేసుకుంటారా అనేది మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఒకవేళ ఇద్దరూ ఏమి గోల్స్ సాధించకుండా 5 గోల్స్‌తోనే ఉంటే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది

ఇక మెస్సీ-ఎంబాపే ఇద్దరూ తమ కెరీర్‌లో ఎప్పుడూ ఈ గోల్డెన్ బూట్ అవార్డును గెలవలేదు. ఒకవేళ మెస్సీ-ఎంబాపే లేదా ఇతర ప్లేయర్లు ఎవరైనా సరే చేసిన గోల్స్ సమానంగా ఉంటే... అప్పుడు ఏ ఆటగాడైతే అతి తక్కువ పెనాల్టీల ద్వారా గోల్స్ చేశారో అతనికే గోల్డెన్ బూట్ అవార్డు వస్తుంది. ప్రస్తుతం లియోనెల్ మెస్సీ మూడు పెనాల్టీలను గోల్స్‌గా మల్చాడు.
ఈ ఘనత నెదర్లాండ్స్, క్రొయేషియా, సౌదీ అరేబియా జట్లపై సాధించాడు.అయితే ఎంబాపే స్కోరు చేసిన గోల్స్ అన్నీ ఔట్ ఫీల్డ్ ద్వారానే వచ్చాయి.ఒకవేళ మెస్సీ ఫైనల్స్‌లో గోల్ చేసి ఎంబాపే ఎలాంటి గోల్ స్కోరు చేయకపోతే ... గోల్డెన్ బూట్ అవార్డు మెస్సీని వరిస్తుంది.ఒక వేళ పెనాల్టీ గోల్స్, ఔట్ ఫీల్డ్ గోల్స్ కూడా టై అయితే అప్పుడు ఏ ప్లేయర్ అయితే తక్కువ గోల్స్ సాధించడంలో తక్కువ పాస్‌లు వినియోగించుకున్నాడో అతన్నే గోల్డెన్ బూట్ అవార్డు వరిస్తుంది.