
హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో తొమ్మిది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.

ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.
దేశం: ఉరుగ్వే
గ్రూపు A: రష్యా, ఉరుగ్వే, సౌదీ అరేబియా, ఈజిప్ట్
వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 14: vs Saudi Arabia
June 19: vs Egypt
June 25: vs Russia
ఫిఫా ర్యాంకింగ్: 17
బెస్ట్ ఫినిష్: రెండు సార్లు ఛాంపియన్. మూడుసార్లు సెమీఫైనలిస్ట్.
స్టార్ ప్లేయర్లు: కవాని, సురెజ్.
కోచ్: ఆస్కార్ తబారెజ్.
గత రికార్డులు:
No. of times team has played in WC (number): 12
No. of matches played (number): 51
No. of matches won: 20
No. of matches lost: 19
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 2
No. of goals scored in WC: 81
అంచనా: రెండుసార్లు ఛాంపియన్ అయిన ఉరుగ్వే జట్టు ఈ గ్రూపు ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్‌లో బ్రెజిల్ తర్వాత అత్యుత్తమ ప్రదర్శన చేసింది మాత్రమే ఉరుగ్వే జట్టే. స్టార్ ప్లేయర్లకు కొదవలేదు. గ్రూపులో ఉరుగ్వేకు ఒక్క ఈజిప్ట్ నుంచి తప్ప ఏ జట్టు నుంచీ గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం లేదు. కోచ్ ఆస్కార్ తబారెజ్ వరుసగా మూడో ప్రపంచకప్‌లో ఉరుగ్వేను నడిపించనున్నాడు.