For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్ 2018: క్వాలిఫై అయిన 32 జట్లు ఇవే

2018లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి అంతా సిద్ధమైంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్ కప్ టోర్నీకి చివరగా అర్హత సాధించిన దేశంగా పెరూ నిలిచింది.

By Nageshwara Rao
FIFA World Cup 2018: The 32 qualified teams

హైదరాబాద్: 2018లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి అంతా సిద్ధమైంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్ కప్ టోర్నీకి చివరగా అర్హత సాధించిన దేశంగా పెరూ నిలిచింది. బుధవారం (నవంబర్ 15)న లిమాతో జరిగిన మ్యాచ్‌లో పెరూ 2-0తో విజయం సాధించి వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించింది.

దీంతో 2018 వరల్డ్ కప్ టోర్నీకి మొత్తం 32 దేశాలు అర్హత సాధించాయి. జూన్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటలీ, నెదర్లాండ్స్, చిలీ, అమెరికా దేశాలు ఈసారి టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి.

2018 వరల్డ్ కప్‌కు దూరమైన అతిపెద్ద దేశంగా ఇటలీ నిలిచింది. అంతేకాదు 60 ఏళ్ల తర్వాత ఇటలీ వరల్డ్ కప్‌కు దూరమైంది. 1958 ప్రపంచకప్‌ తర్వాతి నుంచి ప్రతిసారీ ఈ మెగా టోర్నీలో ఆడుతూ వస్తున్న ఇటలీ 2018లో రష్యా ఆతిథ్యమిస్తోన్న మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.

ఈ వరల్డ్ కప్‌కు దూరమైన అతి పెద్ద జట్టు ఇటలీనే. ఏకంగా నాలుగుసార్లు (1934, 1938, 1982, 2006) వరల్డ్ కప్ గెలిచిన ఘనచరిత్ర ఉన్న ఇటలీ.. వరల్డ్ కప్ అర్హత కోసం చివరగా స్వీడన్‌తో జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌ను 0-0తో డ్రాగా ముగించింది. దీంతో టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.

2018 ఫిఫా వరల్డ్ కప్‌ బరిలో దిగే 32 జట్లు:
1. రష్యా
2. బ్రెజిల్
3. ఇరాన్
4. జపాన్
5. మెక్సికో
6. బెల్జియం
7. దక్షిణ కొరియా
8. సౌదీ అరేబియా
9. జర్మనీ
10. ఇంగ్లాండ్
11. స్పెయిన్
12. నైజీరియా
13. కోస్టా రికా
14. పోలాండ్
15. ఈజిప్ట్
16. ఐస్లాండ్
17. సెర్బియా
18. పోర్చుగల్
19. ఫ్రాన్స్
20. ఉరుగ్వే
21. అర్జెంటీనా
22. కొలంబియా
23. పనామా
24. సెనెగల్
25. మొరాకో
26. ట్యునీషియా
27. స్విట్జర్లాండ్
28 క్రొయేషియా
29. స్వీడన్
30. డెన్మార్క్
31. ఆస్ట్రేలియా
32. పెరు

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, November 16, 2017, 13:08 [IST]
Other articles published on Nov 16, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+