Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్: గ్రూప్ స్టేజిలో స్వీడన్‌కు కష్టమే!

 FIFA World Cup 2018 team analysis: Zlatan-less Sweden united but lack form

హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో పది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్‌ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్‌ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్‌ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.

ఈ వరల్డ్ కప్‌‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరగనున్న ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.


దేశం: స్వీడన్


గ్రూపు F: దక్షిణ కొరియా, జర్మనీ, మెక్సికో


వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
vs South Korea, June 18, at 5.30 PM (Nizhny Novgorod)
vs Germany, June 23, at 8.30 PM (Sochi)
vs Mexico, June 27, at 7.30 PM (Yekaterinburg)


ఫిఫా ర్యాంకింగ్: 23


గత వరల్డ్ కప్: అర్హత సాధించలేదు


వరల్డ్ కప్‌లో చివరి ప్రదర్శన : 2006 (eliminated from Second Round)


బెస్ట్ ఫినిషర్: రన్నరప్ (1958)


స్టార్ ఆటగాళ్లు: ఎమిల్ ఫోర్స్బెర్గ్, విక్టర్ లిండెలోఫ్, మార్కస్ బెర్గ్


కోచ్: జానే ఆండర్సన్


అంచనా: గ్రూప్ స్టేజిలో స్వీడన్ గట్టి పోటీని ఎదుర్కోనుంది. అదే గ్రూపులో డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ ఉండటమే ఇందుకు కారణం. మెక్సికోతో పోటీ కూడా స్వీడన్‌కు కష్టమే. దీంతో ఈ గ్రూప్ నుంచి తొలుత బయటకు వెళ్లే జట్టు స్వీడన్‌ అని సాకర్ అభిమానులు అంచనా వేస్తున్నారు.

Story first published: Monday, June 4, 2018, 13:27 [IST]
Other articles published on Jun 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+