
హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో తొమ్మిది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక

రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.
ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.
దేశం: స్విట్జర్లాండ్
గ్రూపు E: బ్రెజిల్, సెర్బియా, కోస్టారికా, స్విట్జర్లాండ్
వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
Vs Brazil, June 17, at 11.30 pm (Rostov-on-Don)
Vs Serbia, June 22, at 11.30 pm (Kaliningrad)
Vs Costa Rica, June 27, at 11.30 pm (Nizhny Novgorod)
ఫిఫా ర్యాంకింగ్: 6
బెస్ట్ ఫినిష్: క్వార్టర్ ఫైనల్స్ (1934, 1938, 1954)
స్టార్ ప్లేయర్లు: గ్రనిట్ చాఖా, జెహెర్దాన్ షకీరి, రికార్డో రోడ్రిగ్జ్
గత వరల్డ్ కప్ అత్యుత్తమం: 2014లో రౌండ్ 16లో చోటు
కోచ్: వ్లాదిమిర్ పెట్రోకోవిక్
గత రికార్డులు:
No. of times team has played in WC (number): 10
No. of matches played (number): 33
No. of matches won: 9
No. of matches lost: 15
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 0
No. of goals scored in WC: 45
అంచనా: అద్భుతమైన స్టార్ ప్లేయర్లు స్విట్జర్లాండ్ సొంతం. ముఖ్యంగా ఈ జట్టుని యువ ఆటగాళ్లు లీడ్ చేస్తుండటం అంచనాలను పెంచుతోంది. ఫిఫా వరల్డ్ కప్ కోసం క్వాలిఫియర్స్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో స్విట్జర్లాండ్ రెండో స్థానంతో ముగించింది. ఈ గ్రూపులో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మ్యాచ్ మాత్రం ఈ రెండు జట్ల మధ్యే. ఈ మ్యాచ్ జూన్ 17న బ్రెజిల్-స్విట్జర్లాండ్ జట్ల మధ్య జరగనుంది.