
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2018 మరి కొద్ది రోజుల్లో మొదలైపోతోంది. ఇప్పటికే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించిన జట్లన్నీ దాదాపు ప్రాక్టీసు మొదలుపెట్టేశాయి. 16 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా సంరంభంలో 32 దేశాలు పోటీపడనున్నాయి. ఈ 32దేశాలను ఎనిమిది గ్రూపులుగా అంటే.. గ్రూపు ఏ నుంచి హెచ్ వరకూ కేటాయించారు. ఈ గ్రూపుల్లో టాప్ పొజిషన్‌లో ఉన్న రెండు జట్లు నాక్ అవుట్స్‌కు ఎంపికవుతాయి.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
నాకౌట్ మ్యాచ్ నేపథ్యంలో మాస్కోలోని లుజ్‌నింకీ స్టేడియం వేదికగా ఆడిన 16 జట్ల నుంచి కేవలం 8 జట్లు మాత్రమే విజేతగా నిలవాల్సి ఉంది. ఈ లీగ్‌కు సంబంధించి బ్రెజిల్, జర్మనీ జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. అయితే వీటికే స్థాయిలో గట్టిపోటీనిచ్చేందకు.. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం ఎదురుచూస్తున్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా జట్టు సౌదీ అరేబియా జట్టుతో తలపడనుంది.
దేశం: పనామా
గ్రూపు G: పనామా, తునీషియా, బెల్జియం
వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు:
Panama vs Belgium, June 18, at 8.30 pm IST (Sochi)
Panama vs England, June 24, at 5.30 pm IST (Nizhny Novgorod)
Panama vs Tunisia, June 27, at 11.30 pm IST (Saransk)
ఫిఫా ర్యాంకింగ్: 55
గత వరల్డ్ కప్: ఆఖరి ప్రపంచకప్ కు అర్హత సాధించలేకపోయింది.
బెస్ట్ ఫినిష్: ఒకే ఒక్కసారి ఫైనల్ మ్యాచ్ ఆడగలిగింది.
కోచ్: హెర్నాన్ డారియో గోమెజ్
స్టార్ ప్లేయర్లు:
Roman Torres (defender for Seattle Sounders), Jaime Penedo (goalkeeper for Dinamo Bucharest), Jose Luis Rodriguez (midfielder for Gent).
అదృష్టవశాత్తు పట్టేసింది గానీ, వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లేంత అర్హత మాత్రం పనామా జట్టుకు లేదు. చివరిసారిగా జరిగిన వరల్డ్ కప్‌లో పనామా కేవలం గ్రూప్ దశలో మాత్రమే గెలిచింది. పనామా ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుందంటే.. ముందుగా చెలరేగి ఆడి ప్రత్యర్థులను భయపెడతారు. తద్వారా అలసిపోయిన ఆటగాళ్లను వదిలేస్తూ, క్రమంగా విజయం వైపుగా అడుగులేస్తోంది.
ఈ నేపథ్యంలో ఏవైనా చిన్న జట్లతో పోటీపడితే ఫలితం అనుకూలించొచ్చు. కానీ, ప్రత్యర్థి బలంగా ఉంటే మాత్రం పేలవ ప్రదర్శనతో ఇంటి దారి పట్టాల్సిందే. స్వతహాగా కొలంబియన్ అయిన హెర్నాన్ డారియో గోమెజ్ 1998వ సంవత్సరంలో కొలంబియా దేశానికి కోచ్‌గా వ్యవహరించారు. ఈ కోచ్ నేతృత్వంలో ఆడుతున్న పనామా జట్టు ఆటతీరు చూపరులకు చిరాకు పుట్టించేలా ఉంటుంది. కొద్ది సార్లు ఇలాగే మ్యాచ్‌ను గెలిచేస్తారు కూడా.
అంచనా:
గ్రూపు జీ లోనే జట్టు ఎలా గెలుస్తుందో చెప్పలేం. అలాంటిది వరల్డ్ కప్‌లో ఎలాంటి ఆటతీరు ప్రదర్శిస్తుందో చెప్పలేం. సాధ్యమైనంత వరకూ ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లోనే తేలిపోతుంది.