ఫిఫా వరల్డ్ కప్: దక్షిణ కొరియా గ్రూప్ స్టేజిని దాటడం కూడా కష్టమే!

హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో పది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.
ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.
దేశం: దక్షిణ కొరియా
గ్రూపు F: జర్మనీ, స్వీడన్, మెక్సికో
వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 18, Vs Sweden, 5.30pm (Novgorod)
June 23 Vs Mexico, , 8.30pm (Rostov)
June 27 Vs Germany, 7.30pm (Kazan)
ఫిఫా ర్యాంకింగ్: 61
గత వరల్డ్ కప్: గ్రూప్ స్టేజి
బెస్ట్ ఫినిష్: 4th place (2002)
స్టార్ ప్లేయర్లు: సన్ హుంగ్-మిన్, క్వాన్ క్యుంగ్-గెలిచారు, జా-చీల్ క
కోచ్: షిన్ టోయ్-యాంగ్
అంచనా: బలమైన ప్రత్యర్ధి జట్లు ఉన్న నేపథ్యంలో దక్షిణ కొరియా గ్రూప్ స్టేజిని దాటడం కూడా కష్టమేనని అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications