
హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ సాకర సంరంభానికి సర్వం సిద్ధమైంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన జట్లన్నీ బరిలో తలపడేందుకు సిద్దమవుతున్నాయి. సాకర్ అభిమానులు సైతం ఇప్పటికే రష్యాకి చేరుకుంటున్నారు. జూన్ 14 నుంచి జులై 15 వరకు జరిగే ఫిఫా వరల్డ్ కప్‌కు ఈసారి రష్యా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
ఈ వరల్డ్ కప్‌కు మొత్తం 32 జట్లు అర్హత సాధించాయి. మొత్తం ఎనిమిది గ్రూపులు... ఒక్కో గ్రూప్ నుంచి నాలుగు జట్లు. నాలుగు గ్రూపుల్లోని టాప్ రెండు జట్లు మాస్కోలోని లుంజికి స్టేడియంలో జరగనున్న నాకౌట్ మ్యాచ్‌లకు అర్హత సాధించాయి. ఈసారి జరిగే వరల్డ్ కప్‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి.
మరోవైపు అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా జట్టు సౌదీ అరేబియా జట్టుతో తలపడనుంది. 21వ ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొనే మెక్సికో టీమ్ ఎనాలసిస్ సాకర్ అభిమానుల కోసం...
దేశం: మెక్సికో
గ్రూపు F: మెక్సికో, దక్షిణ కొరియా, స్వీడన్, జర్మనీ
వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు:
Vs Germany, June 17, Sunday, at 8:30 PM (Luzhniki Stadium, Moscow)
Vs Korea Republic, June 23, Saturday, at 8:30 PM (Rostov Arena, Rostov-on-Don)
Vs Sweden, June 27, Wednesday, at 7:30 PM (Central Stadium, Yekaterinburg)
ఫిఫా ర్యాంకింగ్: 15
గత వరల్డ్ కప్: 2014 (Eliminated from Round of 16)
బెస్ట్ ఫినిష్: Quarter-finals in 1986
కోచ్: జువాన్ కార్లోస్ ఓస్సియో
స్టార్ ప్లేయర్లు: Javier Hernandez (striker for West Ham United), Jesus Corona (winger for FC Porto), Hirving Lozano (winger for PSV Eindhoven), and Jonathan dos Santos (striker LA Galaxy).
అంచనా: 16 జట్లు ఆడే నాకౌట్ స్టేజికి మెక్సికో అర్హత సాధించడంతో గ్రూప్ Fలో ఫేవరేట్ జట్టుగా ఉంది. జ్లతాన్ ఇబ్రహిమోవిక్ గైర్హాజరీతో స్వీడన్‌తో గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. గ్రూపులోని దక్షిణకొరియా కూడా మెక్సికోకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి స్టేజిలో మెక్సిక్ ఎదుర్కొనబోయే అతిపెద్ద ఛాలెంజ్ బ్రెజిల్‌ను ఢీ కొనడమే.