Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్ 2018: ఐస్‌లాండ్ గ్రూప్‌ దశ వరకేనా?

FIFA World Cup 2018 team analysis: Can giant-killers Iceland emulate Euro success?

హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో తొమ్మిది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్‌ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్‌ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్‌ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.

ఈ వరల్డ్ కప్‌‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.

FIFA World Cup 2018 team analysis: Can giant-killers Iceland emulate Euro success?

యూరో 2016లో రౌండ్‌-16లో ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించిన ఐస్‌లాండ్‌ అదే ఊపుతో యూఈఎఫ్‌ఏ క్వాలిఫయింగ్‌ టోర్నీ గ్రూప్‌-1లో టాపర్‌గా నిలిచి తొలిసారి వరల్డ్‌ కప్‌ టిక్కెట్‌ చేజిక్కించుకుంది. కేవలం 3 లక్షల 30 వేల జనాభా గల ఈ దేశం ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అతి చిన్న దేశంగా రికార్డు సృష్టించింది.

చిన్న జట్టే అయినా చాలా గట్టి జట్టు. నాణ్యమైన ఆటగాళ్లతో కూడిన ఐస్‌లాండ్‌కు సంచలనాలు సృష్టించే సత్తా ఉంది. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడబోతున్నా తనదైన రోజున ఏ జట్టుకైనా షాకివ్వగలదు. 2016 యూరో క్వార్టర్‌ఫైనల్‌ చేరడం ద్వారా తన ప్రతిభను, పట్టుదలను ఐస్‌లాండ్‌ నిరూపించుకుంది.


దేశం: ఐస్‌లాండ్‌


గ్రూపు D: అర్జెంటీనా, క్రొయేషియా, నైజీరియా, ఐస్‌లాండ్‌


వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
vs Argentina, June 16, at 6.30 PM (Moscow)
vs Nigeria, June 22, at 8.30 PM (Volgograd)
vs Croatia, June 26, at 11.30 PM (Rostov)


ఫిఫా ర్యాంకింగ్: 22


బెస్ట్ ఫినిష్: తొలిసారి ప్రపంచకప్‌ ఆడబోతోంది


స్టార్ ప్లేయర్లు: గిల్ఫీ సిగుర్డ్‌సన్‌, ఆల్‌ఫ్రెడ్‌ ఫిన్‌బోగాసన్‌, జొహాన్‌ బెర్గ్‌ గ్యూమండ్సన్‌


కోచ్: హాల్‌గ్రిమ్సన్‌


అంచనా: ఐస్‌లాండ్ చిన్న జట్టు అయినా ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో సరికొత్త ఆశలతో బరిలోకి దిగుతోంది. బలమైన గ్రూపులోనే ఉన్నా నాకౌట్‌ అవకాశాలను కొట్టిపారేయలేం. క్రొయేషియా, టర్కీ, ఇంగ్లాండ్‌ వంటి జట్లపై గెలిచిన అనుభవమున్న ఐస్‌లాండ్‌ ప్రపంచకప్‌లో సత్తా చాటే అవకాశం ఉంది.

Story first published: Thursday, June 7, 2018, 18:45 [IST]
Other articles published on Jun 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+