
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2018 మరి కొద్ది రోజుల్లో మొదలైపోతోంది. ఇప్పటికే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించిన జట్లన్నీ దాదాపు ప్రాక్టీసు మొదలుపెట్టేశాయి. 16 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా సంరంభంలో 32 దేశాలు పోటీపడనున్నాయి. ఈ 32దేశాలను ఎనిమిది గ్రూపులుగా అంటే.. గ్రూపు ఏ నుంచి హెచ్ వరకూ కేటాయించారు. ఈ గ్రూపుల్లో టాప్ పొజిషన్‌లో ఉన్న రెండు జట్లు నాక్ అవుట్స్‌కు ఎంపికవుతాయి.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
నాకౌట్ మ్యాచ్ నేపథ్యంలో మాస్కోలోని లుజ్‌నింకీ స్టేడియం వేదికగా ఆడిన 16 జట్ల నుంచి కేవలం 8 జట్లు మాత్రమే విజేతగా నిలవాల్సి ఉంది. ఈ లీగ్‌కు సంబంధించి బ్రెజిల్, జర్మనీ జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. అయితే వీటికే స్థాయిలో గట్టిపోటీనిచ్చేందకు.. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం ఎదురుచూస్తున్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా జట్టు సౌదీ అరేబియా జట్టుతో తలపడనుంది.
ఒక్కోసారి బెల్జియం జట్టు క్రీడాకారులు కోచ్ సలహాలకు సంబంధం లేకుండా ప్రవర్తిస్తుంటారు. జట్టు బలాబలాలు ముందుగానే పసిగట్టి. జట్టులో అంతర్గతంగా రూపొందించుకున్న ప్లాన్-బీని ప్రయోగించి విజయాన్ని రాబడతారు. రష్యా టోర్నీలో ఆడేందుకు ఎవర్డన్ క్లబ్ మాజీ మేనేజర్ .. బెల్జియం కోచ్ అయిన మార్టినేజ్ ఆటగాళ్ల దగ్గర ప్లాన్ బి కూడా అందుబాటులో ఉంటుందని విశ్వసిస్తున్నాడు. కాగా, మార్టినేజ్ నేతృత్వంలో బెల్జియం జట్టు ఆడుతున్న తొలి అతి పెద్ద టోర్నీ ఇదే.
నిజానికైతే బెల్జియం జట్టు కూర్పు బలంగానే ఉండటంతో ఎక్కువగా గోల్స్ చేయగలదని, కానీ రష్యా గడ్డపై ప్రత్యర్థులను బట్టే బెల్జియం భవిష్యత్ తెలియనుంది.
దేశం: బెల్జియం
గ్రూపు G: పనామా, తునీషియా, ఇంగ్లాండ్
వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు:
Panama, June 18, at 8.30 pm IST (Sochi) Belgium
Tunisia, June 23, at 5.30 pm IST (Moscow Spartak)
England, June 27, at 11.30 pm IST (Kaliningrad)
ఫిఫా ర్యాంకింగ్: 3
గత వరల్డ్ కప్: 2014 (Eliminated from quarterfinals by Argentina)
బెస్ట్ ఫినిష్: Fourth place finish in 1986
కోచ్: Roberto Martinez
స్టార్ ప్లేయర్లు: Eden Hazard (midfielder for Chelsea), Kevin de Bruyne (midfielder for Manchester City), Romelu Lukaku (striker for Manchester United), Thibaut Courtois (goalkeeper for Chelsea)
అంచనా:
గ్రూపు gలో భాగంగా ఆడుతున్న బెల్జియం క్వార్టర్ ఫైనల్స్‌కు దాదాపు ఖాయమైనట్లే. కానీ, ఆ తర్వాత ఎదుర్కోనున్న దక్షిణ అమెరికా జట్లను ఎదుర్కొని నిలవడం అనేది బెల్జియంకు పరీక్షే.