Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌ పోరుకు దూసుకుపోయిన స్వీడన్

World Cup 2018 last 16: Sweden 1 Switzerland 0
emil-forsberg-celebrates-switzerland-1530634201-MYKHEL-LAPI

హైదరాబాద్: ఫిఫా నాకౌట్ పోరుకు స్వీడన్ ముందడుగు వేసింది. ఒకే గోల్ తో సాధించిన విజయంతో ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగు పెట్టింది స్వీడెన్. స్విట్జర్లాండ్ తో జరిగిన లాస్ట్ 16 మ్యాచ్‌లో 1-0 గోల్స్ తేడాతో స్వీడెన్ జయకేతనం ఎగరేసింది. తద్వారా క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. స్విస్ ఆటగాళ్లతో పోలిస్తే స్వీడెన్ ప్లేయర్లు ఆద్యంతం మెరుగైన ప్రదర్శన కనబరిచారు. అందుకు తగ్గ ఫలితాన్ని సాధించారు.

మ్యాచ్‌ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతూ వచ్చాయి. ఈ క్రమంలో బంతి ఎక్కువసేపు స్విట్జర్లాండ్‌ చేతిలో ఉన్నా గోల్‌ మాత్రం నమోదు చేయలేకపోయింది. దీంతో తొలి అర్ధభాగం గోల్‌ లేకుండానే ముగిసింది. ఒకటీ రెండు సార్లు గోల్ అవకాశం వచ్చినా స్విస్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. స్వీడెన్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది.

1
958077

అనంతరం అదే దూకుడుతో రెండో అర్ధభాగాన్ని ప్రారంభించిన స్వీడన్‌.. 66నిమిషంలో తొలి గోల్‌ నమోదు చేసింది. ఫోర్సెబర్గ్‌ నేరుగా గోల్‌ చేసి స్వీడన్‌కు ఆధిక్యాన్ని అందించాడు. స్విట్జర్లాండ్ గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. మరోవైపు ఇంజూరీ టైమ్‌లోనూ మరో గోల్‌ లేకపోవడంతో స్వీడన్‌ 1-0తో గెలిచి క్వార్టర్స్‌కు చేరుకుంది. సోమవారం ఎల్లో జెర్సీ జట్టు బ్రెజిల్ క్వార్టర్స్‌లోకి ఎంటరవ్వగా, మంగళవారం కూడా ఎల్లో జెర్సీ జట్టునే విజయం వరించింది.

1994 తర్వాత ప్రపంచకప్ లో స్వీడెన్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించడం ఇది తొలి సారి. ఈ మ్యాచ్‌లో కూడా తొలి సగంలో గోల్సేమీ నమోదు కాకపోవడం విశేషం. 66వ నిమిషంలో ఫోర్స్ బర్గ్ మెరుపు వేగంలో కిక్ ఇవ్వగా బంతి స్విస్ ఆటగాడికి తగిలి గోల్ పోస్టులో పడింది. తద్వారా మ్యాచ్ లో తొలి గోల్ నమోదైంది. ఆ తర్వాత మరో గోల్ నమోదు కాకుండానే మ్యాచ్ ముగిసింది. ఎక్స్ ట్రా టైమ్‌లో కొంత హైడ్రామా నెలకొంది. స్వీడెన్‌కు మరో గోల్ అవకాశం వచ్చినట్టుగానే వచ్చి చేజారింది.

Story first published: Tuesday, July 3, 2018, 23:08 [IST]
Other articles published on Jul 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+