ఫిఫా వరల్డ్ కప్ 2018: సౌదీ అరేబియాపై ఆశల్లేవు

హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో తొమ్మిది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.
ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.
దేశం: సౌదీ అరేబియా
గ్రూపు A: రష్యా, ఉరుగ్వే, ఈజిప్ట్
వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 14: vs Russia
June 20: vs Uruguay
June 25: vs Egypt
ఫిఫా ర్యాంకింగ్: 67
బెస్ట్ ఫినిష్: 1994 నుంచి వరుసగా నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన రెండో రౌండే.
స్టార్ ప్లేయర్లు: మహ్మద్ అల్ సలావి, అల్ మువాలద్.
కోచ్: జువాన్ ఆంటానియో పిజి.
అంచనా: ప్రస్తుత ఫిఫా ర్యాంకింగ్స్‌లో అతి తక్కువ స్థానం (67)లో ఉన్న జట్టు సౌదీ అరేబియానే. 12 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో అడుగుపెట్టింది. అయితే, ఈ వరల్డ్ కప్‌కు సౌదీ అరేబియా సన్నాహం ఏమాత్రం బాగాలేదు. టోర్నీకి అర్హత సాధించిన తర్వాత ఇద్దరు కోచ్‌లకు ఉద్వాసన పలికింది. ఈసారి కూడా సౌదీ గొప్ప ప్రదర్శన చేయగలదని ఎవరూ భావించట్లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications