మెస్సీ-రొనాల్డొ.. దంపతుల మధ్య చిచ్చు పెట్టారు..!!


హైదరాబాద్: అభిమానులను సంపాదించుకోవడంలో ఫుట్‌బాల్ ప్రపంచంలోనే రారాజు. అలాంటిది మేటి ఆటగాళ్లుగా రాణిస్తున్న రొనాల్డొ, మెస్సీలకు అభిమానులు కోకొల్లలు. ఎంత అభిమానమంటే ఇంటిని మొత్తం మెస్సీ జెర్సీ రంగుల్లో నింపేసే అంతా.. ఒంటి నిండా మెస్సీ, రొనాల్డొ బొమ్మలు పచ్చబొట్టు వేయించుకునేంత. వాళ్లలో ఉన్న పోటీతత్వమే అంతటి స్థాయిలో అభిమానులు సంపాదించిపెట్టింది. ఈ పోటీ అభిమానుల మధ్య కూడా ఉండడంతో పలు వివాదాలకు సైతం దారితీసింది.

రొనాల్డో- మెస్సీల గొప్పదనం గురించి చర్చ
ఈ క్రమంలోనే రొనాల్డో- మెస్సీల గొప్పదనం గురించి నడుస్తున్న చర్చ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. ఈ గొడవ పెద్దదై చివరకు విడాకుల వరకు తీసుకెళ్లింది. ఒకరు రొనాల్డో అభిమాని కాగా.. మరొకరు మెస్సీ అభిమాని. అయితే ఈ ఇద్దరిని కలిపింది కూడా ఈ ఫుట్‌బాల్ ఆటనే కావడం విశేషం.

2002 ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌ను చూస్తూ
ఓ రష్యన్ పత్రిక కథనం మేరకు.. అర్సెన్, ల్యూధ్‌మిలా అనే దంపతులు ఓ బార్‌లో 2002 ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌ను చూస్తూ కలుసుకున్నారు. అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కింది. అయితే 16 ఏళ్ల అనంతరం తమ అభిమాన ఆటగాళ్ల విషయంలో జరిగిన గొడవ వారి బంధానికి ఎండ్ కార్డ్ వేసింది.

నైజీరియాపై అర్జెంటీనా విజయాన్ని
నైజీరియాపై అర్జెంటీనా విజయాన్ని భర్త ఆస్వాదిస్తుండగా.. ఆగ్రహానికిలోనైన భార్య.. మెస్సీ కన్నా రోనాల్డో గొప్పవాడనే టాపిక్ తీసుకొచ్చింది. దీంతో ఈ దంపతులు మధ్య ఈ విషయంలో తీవ్ర చర్చ జరిగింది. ఇది చినికి చినికి పెద్ద గొడవకు దారీ తీసింది. ఫిఫా ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి తన అభిమాన ఆటగాడు మెస్సీని తక్కువ చేస్తూ తన భార్య మాట్లాడుతూనే ఉందని, ఆమె రోనాల్డోను పిచ్చిగా అభిమానిస్తుందని అతను మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది భరించలేకనే ఆమెకు దూరంగా వచ్చానని, ఇలా గొడవ జరగడం ఇదే తొలి సారి కాదన్నాడు.

విసుగు చెందే విడాకులకు దరఖాస్తు:
దీంతో విసుగు చెందే విడాకులకు దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల పోరు నాకౌట్‌లో ఒకే రోజు ముగిసిన విషయం తెలిసిందే. అర్జెంటీనా ఫ్రాన్స్ చేతిలో ఓడిపోగా.. పోర్చ్‌గల్ ఉరుగ్వే చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications