
హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో పది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.
ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరగనున్న ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.
దేశం: రష్యా
గ్రూపు A: ఉరుగ్వే, సౌదీ అరేబియా, ఈజిప్టు
వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
* June 14: vs Saudi Arabia
* June 19: vs Egypt
* June 25: vs Uruguay
ఫిఫా ర్యాంకింగ్: 65
కీలక ఆటగాళ్లు: gor Akinfeev, Yuri Zhirkov, Denis Glushakov
గత వరల్డ్ కప్: రష్యాగా ఎప్పుడూ కనీసం గ్రూప్ దాటలేదు.
వరల్డ్ కప్‌లో చివరి ప్రదర్శన: రష్యా ఫెడరేషన్‌గా అత్యుత్తమంగా ఒకసారి సెమీస్ చేరింది.
గత రికార్డులు:
No. of times team has played in WC (number): 10
No. of matches played (number): 40
No. of matches won: 17
No. of matches lost: 15
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 0
No. of goals scored in WC: 66
కోచ్: స్టానిస్లావ్ చెర్చెసోవ్.
అంచనా: ఆతిథ్య జట్టుగా ప్రపంచకప్‌లో చోటు సంపాదించింది. 2008 నుంచి ఏ టోర్నీలోనూ గ్రూప్ దశ దాటని ఈ జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు. క్వార్టర్ ఫైనల్స్ లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.. గ్రూప్ దశ దాటే అవకాశాలు చాలా తక్కువ. ఉరుగ్వేతో డ్రా చేసుకున్నా గొప్పే. సౌదీ అరేబియాపై గెలిచే అవకాశమున్న రష్యా.. కష్టపడితే ఈజిప్ట్‌పై గెలవొచ్చని భావిస్తోంది. సొంతగడ్డపై జరిగే వరల్డ్ కప్‌కు సన్నాహకంగా 2016 నుంచి ఆడిన 18 స్నేహపూర్వక మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచే అవకాశాలే ఎక్కువ. కోచ్‌కు ఆటగాళ్లకు మధ్య సఖ్యత లేదని వార్తలు వచ్చాయి.