Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రొనాల్డో.. చేతుల మీదుగా పోర్చుగల్‌కు మరో విజయం

Fifa World Cup 2018 : Cristiano Ronaldo Gave A Fabulous Performance
FIFA World Cup 2018: Portugal 1 Morocco 0

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిష్టియానో రొనాల్డో మరోసారి మెరుపు ప్రదర్శన చేశాడు. గ్రూపు-బిలో మొరాకోతో జరుగుతున్న మ్యాచ్‌లో రొనాల్డో 4వ నిమిషంలోనే హేడర్‌గోల్‌తో‌ పోర్చుగల్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాతి నుంచి ఇరు జట్లు బంతిని నియంత్రణలో ఉంచుకోవడానికి తీవ్రంగా పోటీపడ్డాయి.

మ్యాచ్ ఆరంభమైన నాలుగు నిమిషాలకే గోల్ కొట్టి అదరగొట్టాడు. తనదైన శైలిలో హెడర్ గోల్‌తో పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. రొనాల్డో వేగాన్ని చూసి మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన అభిమానులు ఆశ్చర్యపోయారు. తరువాత తేరుకున్న మొరాకో గట్టిగానే పుంజుకుంది. ఆ తర్వాత ఇరు జట్లు బంతిని నియంత్రించేందుకు గట్టిగానే పోటీపడ్డాయి.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

FIFA World Cup 2018: Portugal 1 Morocco 0

రెండు జట్లు గోల్‌పోస్ట్‌లపై ఎటాకింగ్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రథమార్థంలో రెండు టీమ్‌లు బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు పోరాడాయి. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న పోర్చుగల్ 1-0గోల్‌తో విజయం సాధించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్‌తో ఇరాన్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన మొరాకోకు మరోసారి నిరాశ తప్పలేదు.

ఈ మ్యాచ్‌లో ఎక్కువగా తోసుకోవడాలు జరగడంతో.. ఎల్లో కార్డు అందుకున్నాడు. మ్యాచ్ మొత్తం మీద మొరాకోపై పోర్చుగల్‌దే పైచేయిగా కనిపించింది. పదేపదే గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. పోర్చుగల్ ఆధిపత్యాన్ని ధాటిగా ఎదుర్కొనేందుకు మొరాకో కూడా ఆరంభం నుంచే చక్కటి సమన్వయంతో ఆడడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. తొలి గోల్ అనంతరం రెండు జట్ల గోల్‌కీపర్లు చాకచక్యంగా వ్యవహరించి గోల్ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఆఖర్లో ఇంజురీ సమయంలో ఇరు జట్ల క్రీడాకారులు వాగ్వివాదానికి దిగడంతో రిఫరీ కల్పించుకొని వారించాడు.

Story first published: Wednesday, June 20, 2018, 20:09 [IST]
Other articles published on Jun 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+