న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్ 2018: పోలాండ్ ఆశలన్నీ అతడిపైనే!

By Nageshwara Rao
FIFA World Cup 2018: Poland team, records, fixtures

హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో ఆరు రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్‌ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్‌ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్‌ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.

ఈ వరల్డ్ కప్‌‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.


దేశం: పోలాండ్


గ్రూపు H: జపాన్, పోలాండ్, సెనెగల్, కొలంబియా


వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 19: vs Senegal
June 24: vs Colombia
June 28: vs Japan


ఫిఫా ర్యాంకింగ్: 8


ఉత్తమ ప్రదర్శన: 1974, 1982 ప్రపంచకప్‌ల్లో మూడో స్థానం.


స్టార్ ప్లేయర్లు: రాబెర్ట్‌ లెవన్‌డోవిస్కీ, మిలిక్‌, లుకాజ్‌ టెడోర్జిక్‌.


కోచ్: ఆడమ్‌ నవాల్క.


గత రికార్డులు:
No. of times team has played in WC (number): 7
No. of matches played (number): 31
No. of matches won: 15
No. of matches lost: 11
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 0
No. of goals scored in WC: 44


అంచనా: క్వాలిఫయర్స్‌లో 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పోలాండ్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. దీంతో వరల్డ్ కప్‌లో గత వైభవాన్ని తిరిగి పొందేందుకు శాయశక్తులా పోరాడుతుందనడంలో ఎటువంటి సందేహాం లేదు. గ్రూప్‌ ఫేవరేట్‌గా బరిలో దిగుతున్న ఈ జట్టుకు గ్రూప్‌ దశ దాటడం కష్టం కాకపోవచ్చు. అందరి కంటే ఎక్కువగా అర్హత మ్యాచ్‌ల్లో 16 గోల్స్‌ చేసి అగ్రస్థానంలో నిలిచిన రాబర్టో లెవన్‌డోవిస్కీపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. 2016 యూరో కప్‌ నుంచి రాబర్టో గోల్‌ చేయని మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా పోలెండ్‌ విజయం సాధించలేదు. కొలంబియాతో జరిగే మ్యాచ్‌లో తడబడితే, అది జపాన్‌, సెనెగల్‌కు మెరుగైన అవకాశాలను కల్పించనుంది.

Story first published: Saturday, June 9, 2018, 15:36 [IST]
Other articles published on Jun 9, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X