న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్ 2018: మళ్లీ సంచలనం సృష్టించిన సెనెగల్

Fifa Worls Cup 2018 : Senegal Won Match
poland-1-2-senegal-good-fortune-bad-errors-hand-africans

హైదరాబాద్: సంచనాలు సృష్టించి పునర్వైభవాన్ని తెర మీదకు తేవాలనే ప్రయత్నంలో.. ఈ సారి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన సెనెగల్‌ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. గ్రూపు-హెచ్‌లో పోలెండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1తో ప్రపంచకప్‌లో బోణీ కొట్టంది. గ్రూపు ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోలెండ్‌ మ్యాచ్‌ ఆరంభం నుంచే ఎటాకింగ్‌ ఆటను ప్రారంభించింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

సెనెగల్‌ ఢిపెన్స్‌ ఛేదిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో మ్యాచ్‌ 37వ నిమిషంలో పోలెండ్‌ ఆటగాడు కోనెక్‌ ఓన్‌గోల్‌తో సెనెగల్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. బంతి ఎక్కువ సేపు పోలెండ్‌ నియంత్రణలో ఉన్నా.. ఓన్‌గోల్‌ కారణంతో పోలెండ్‌కు నిరాశ తప్పలేదు. ఇక అనంతరం ఆరంభమైన ద్వితీయార్ధంలోనూ హోరాహోరీగా మ్యాచ్‌ ఆరంభమైంది. బంతిని నియంత్రణలో ఉంచుకునేందుకు హోరాహోరీగా పోరాడాయి.

1
958068

ఈ క్రమంలో 60వ నిమిషంలో సెనెగల్‌ ఫార్వర్డ్‌ర్‌ నియాంగ్‌ నేరుగా గోల్‌ చేసి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. కాగా మ్యాచ్ సమయం ముగుస్తున్న తరుణంలో పోలెండ్‌ మిడ్‌ఫీల్డర్‌ క్రైచోయాక్‌ 86వ నిమిషయంలో గోల్‌ చేసి పోలెండ్‌కు తొలి గోల్‌ అందించాడు. దీంతో స్కోరు 2-1గా మారింది. కానీ ఆ తర్వాత మరో గోల్‌ నమోదు కాకపోవడంతో సెనెగల్‌ 2-1తో మ్యాచ్‌ గెలిచినట్లయింది.

ఈ మెగా టోర్నీలో ఇప్పటికి మూడుసార్లు సెల్ఫ్‌గోల్‌ నమోదయ్యాయి. ముందుగా గ్రూపు-బిలో ఇరాన్‌-మొరాకోల మధ్య జరిగిన పోరులో మొరాకో ఆటగాడు అజీబ్‌ ఓన్‌గోల్‌తో ఇరాన్‌ను గెలిపించాడు. ఆ తర్వాత గ్రూపు-డిలో క్రొయేషియా-నైజీరియా మ్యాచ్‌లోనూ మరో సెల్ఫ్‌గోల్ నమోదైంది. మ్యాచ్‌ 32వ నిమిషయంలో నైజీరియా ఆటగాడు ఎట్బో ఓన్‌గోల్‌తో క్రొయేషియాకు ఆధిక్యాన్ని అందించాడు. తాజాగా పోలెండ్‌ ఆటగాడు కోనెక్‌ సెల్ఫ్‌గోల్‌ చేసి వాటి సంఖ్యను పెంచాడు.

ఆఫ్రికన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ గ్రూప్‌-డిలో ఓటమన్నదే లేకుండా రష్యా వరల్డ్ కప్‌లో సెనెగల్ అడుగుపెట్టింది. 2002లో తొలి వరల్డ్‌కప్‌లో క్వార్టర్స్‌ చేరి యావత్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని సెనెగల్‌ అప్పటి నుంచి పెను సంచలనమే సృష్టించింది. ఆ ప్రపంచకప్‌లో తొలిసారిగి బరిలో దిగిన ఈ జట్టు ఆరంభ మ్యాచ్‌లోనే అప్పటి ప్రపంచ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌కు షాకిచ్చింది. అదే ఊపుతో క్వార్టర్స్‌కు దూసుకుపోయి ఔరా అనిపించింది.

Story first published: Tuesday, June 19, 2018, 23:48 [IST]
Other articles published on Jun 19, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X