
హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో అంచనాలు తారుమారవుతున్నాయి. ఆరంభ మ్యాచ్‌లో క్రోయేషియా చేతిలో ఓడిన నైజీరియా శుభారంభం చేసింది. పాయింట్ల పట్టికలో ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన క్రోయేషియా తరువాతి స్థానంలో నైజీరియా నిలిచింది.
ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అతి చిన్న దేశంగా రికార్డు సృష్టించిన ఐస్‌లాండ్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం తప్పలేదు. ఐస్‌లాండ్ తమ తొలి మ్యాచ్‌లో భాగంగా అర్జెంటీనాతో మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించినా రెండో మ్యాచ్ లో ఉపయోగం లేకుండా పోయింది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఐస్‌లాండ్ గ్రూప్-డీలో భాగంగా శుక్రవారం నైజీరియాతో జరిగిన పోరులో 2-0తో పరాజయం పాలైంది.
ఆరంభం నుంచి మ్యాచ్‌లో నైజీరియా ఆటగాళ్ల ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోయింది. కౌంటర్ అటాకింగ్‌తో ఐస్‌లాండ్ రేసులోకి రాకుండా నైజీరియా అడ్డుకుంది. తొలి సెషన్‌లో గోల్ కొట్టేందుకు ఇరుజట్లకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. అహ్మద్ ముసా(49వ, 75వ నిమిషంలో) వరుసగా రెండు గోల్స్ కొట్టి నైజీరియాను ఆధిక్యంలో నిలిపాడు.
83వ నిమిషయంలో వార్ సాంకేతిక సాయంతో ఐస్‌లాండ్‌కు పెనాల్టీ లభించింది. ఒత్తిడిలో ఉన్న సిగుర్డ్‌సన్ తన్నిన బంతి నెట్ మీది నుంచి వెళ్లిపోవడంతో ప్రత్యర్థి నైజీరియా శిబిరంలో ఉత్సాహం వచ్చింది. మ్యాచ్ ముగిసే సమయం వరకు గోల్ చేసేందుకు పోరాడిన ఐస్‌లాండ్‌కు ఓటమి తప్పలేదు.