Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్ 2018: యువకులతో కళకళలాడుతోన్న నైజీరియా

FIFA World Cup 2018: Nigeria team, records, fixtures

హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో తొమ్మిది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్‌ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్‌ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్‌ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.

ఈ వరల్డ్ కప్‌‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.

FIFA World Cup 2018: Nigeria team, records, fixtures

దేశం: నైజీరియా


గ్రూపు D: నైజీరియా, క్రొయేషియా, ఐస్‌లాండ్, అర్జెంటీనా


వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 16: vs Croatia
June 22: vs Iceland
June 26: vs Argentina


ఫిఫా ర్యాంకింగ్: 47


వరల్డ్‌కప్‌లో అత్యుత్తమం: 1994, 1998, 2014లో రౌండ్‌ 16


స్టార్ ప్లేయర్లు: జాన్‌ ఓబి మైఖేల్‌, కెలేచీ హియాన్చో, విక్టర్‌ మోసెస్‌


కోచ్: గెర్నాట్‌ రోర్‌


గత రికార్డులు:
No. of times team has played in WC (number): 5
No. of matches played (number): 18
No. of matches won: 4
No. of matches lost: 9
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 0
No. of goals scored in WC: 20


అంచనా: గ్రూప్‌ దశను దాటకపోవచ్చు. ఆఫ్రికా ప్రాంతం నుంచి అత్యంత నిలకడగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తున్న జట్టు. ఆఫ్రికా ఛాంపియన్‌ కామెరూన్‌, మాజీ ఛాంపియన్‌ జాంబియా, అల్జీరియాలను తోసిరాజని ఈసారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. రెండో రౌండ్‌కు బలంగా పోటీలో ఉంది. నవంబరులో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో అర్జెంటీనాపై 4-2తో విజయం సాధించింది. అనూహ్య ఆటతీరుకు మారుపేరైన ఈ సూపర్‌ ఈగిల్స్‌ను ఎదుర్కోవడం ఎంతటి జట్టుకైనా సవాలే.

Story first published: Friday, June 8, 2018, 15:15 [IST]
Other articles published on Jun 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+