హైదరాబాద్: కొడిగట్టిన ఆశలు చిగురించిన వేళ.. మళ్లీ నీరు గార్చాడు నెయ్మార్.. ఫిఫా వరల్డ్ కప్ బ్రెజిల్ తరపున బరిలోకి దిగాల్సిన నెయ్మార్ అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల నుంచి జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే కోలుకుని ప్రాక్టీసు మ్యాచ్‌లో పాల్గొనడంతో అభిమానులతో పాటు అధికారులంతా మళ్లీ జట్టుతో పాటు ఆడతాడనుకుని అంచనాలు వేసుకున్నాయి. అలాంటిది.. మళ్లీ అతను ఫిట్‌గా లేడని తెలియడంతో అంతా నిరుత్సాహానికి గురి కావాల్సి వచ్చింది. గత వరల్డ్‌కప్‌లో అతడు టీమ్‌లో ఉన్నంత వరకు బ్రెజిల్ వరుస విజయాలతో దూసుకెళ్లింది.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
అయితే.. ఆఖరుగా ఆడిన లీగ్ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడటంతో నెయ్మార్ మొత్తం టోర్నీకే దూరమైయ్యాడు. దీంతో.. అతని జట్టు సెమీఫైనల్లోనే ఓడిపోయి ఇంటిదారి పట్టింది. మళ్లీ ఈసారి తొలి మ్యాచ్ కూడా ఆడక ముందే నెయ్మార్ పూర్తి ఫిట్‌గా లేడన్న వార్త బ్రెజిల్‌ను ఆందోళనకు గురి చేస్తుంది. ఆదివారం స్విట్జర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది బ్రెజిల్. అయితే తమ స్టార్ ప్లేయర్ నెయ్మార్ పూర్తి ఫిట్‌గా లేడని ఆ టీమ్ కోచ్ టిటె చెప్పాడు.
కాలి ఎముక విరగడంతో గత ఫిబ్రవరిలో సర్జరీ చేయించుకున్నాడు నెయ్మార్. వరల్డ్‌కప్‌కు ముందు కూడా అతను పెద్దగా ఆడింది లేదు. కేవలం రెండు వార్మప్ గేమ్స్ మాత్రమే ఆడాడు. ఇప్పటికే అతను వంద శాతం ఫిట్‌గా లేడు.. కానీ అతనికున్న అత్యుత్తమ శారీరక లక్షణాలు నెయ్‌మార్‌ను ప్రత్యేకంగా నిలుపుతాయి. ముఖ్యంగా అతని స్పీడ్ అద్భుతం. ఆదివారం మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని అనుకున్నా. అయినా అతను మ్యాచ్ ఆడే పరిస్థితుల్లోనే ఉన్నాడు అని కోచ్ టిటె వెల్లడించాడు.
ఒకవేళ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకున్నా.. రెండో మ్యాచ్ నుంచి అయినా మ్యాచ్ ఆడతాడనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని తెలిపాడు. రష్యా వేదికగా గ్రూపు ఈ లో భాగమైన స్విట్జర్లాండ్ తర్వాత కోస్టారికా, సెర్బియాలతో ఆదివారం బ్రెజిల్ ఆడాల్సి ఉంది.