
హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్‌కు ముందు జర్మనీ ఆటగాడు లెరోయ్ సేన్‌కు పెద్ద షాక్ తగిలింది. జూన్ 14 నుంచి జులై 15 వరకు రష్యా ఆతిథ్యమిస్తోన్న ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొనే జర్మనీ జట్టుని ప్రకటించింది. 23 మంది సభ్యులతో కూడిన జట్టులో లెరోయ్ సేన్‌కు చోటు దక్కలేదు. మరోవైపు 2014 ఫిఫా వరల్డ్ కప్ గోల్ కీపర్ మాన్యుయల్ నెయుర్‌కు కూడా చోటు దక్కడం విశేషం.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
గాయంతో గత కొంతకాలంగా పుట్‌బాల్‌కు దూరమైన గోల్ కీపర్ మాన్యుయల్ నెయుర్‌కు అత్యంత ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మాంచెస్టర్ సిటీ స్ట్రైకర్ లెరోయ్ సేన్‌కు జర్మనీ జట్టు కోచ్ జోయాచిమ్ లూయి చోటు కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాన్యుయల్ నెయుర్ చివరిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. జర్మనీ తిరిగి తన టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో 32 ఏళ్ల మాన్యుయల్ నెయుర్ కీలకం కానున్నాడు. గాయం కారణంగా అతడు ఎనిమిది నెలలు ఆటకు దూరమైనా... అతడి ప్రదర్శన ఎంతో కీలకంగా కానుంది.

ఫిఫా వరల్డ్ కప్‌కు 23 మందితో కూడిన జర్మనీ జట్టు ఇదే:
గోల్ కీపర్లు: మాన్యుయల్ నెయుర్ (బేయర్న్ మ్యూనిచ్), మార్క్-ఆండ్రే టెర్ స్టెగెన్ (బార్సిలోనా), కెవిన్ ట్రాప్ప్ (పారిస్ సెయింట్-జర్మైన్)
డిఫెండర్లు: మార్విన్ ప్లాటెన్హార్డ్ట్ (హెర్తా బెర్లిన్), జోనాస్ హెక్టర్ (కొలోన్), మాథియాస్ గిన్టర్ (మోఎన్చెన్గ్లాబ్బాక్), మాట్స్ హమ్మెల్స్ (బేయర్న్ మ్యూనిచ్), నిక్లాస్ స్యూలే (బేయర్న్ మ్యూనిచ్), ఆంటోనియో రుడిగెర్ (చెల్సీ), జెరోమ్ బోటెంగ్ (బేయర్న్ మ్యూనిచ్), జాషువా కిమ్మిచ్ (బేయర్న్ మ్యూనిచ్)
మిడ్ ఫీల్డర్లు: థామస్ క్రోస్ (రియల్ మాడ్రిడ్), మెసట్ ఓజిల్ (ఆర్సెనల్), థామస్ ముల్లెర్ (బేయర్న్ మ్యూనిచ్), సెబాస్టియన్ రుడి (బేయర్న్ మ్యూనిచ్), జూలియన్ బ్రాండ్ట్ (బేయర్ లేవేర్కుసేన్) , ఇల్కే గుండోగాన్ (మాంచెస్టర్ సిటీ), లియోన్ గోరేట్జ్కా (షల్కే 04), మార్కో రెయుస్ (బోరుస్సియా డార్ట్ముండ్)
ఫార్వర్డ్స్: టిమో వెర్నెర్ (RB లీప్జిగ్), మారియో గోమెజ్ (VfB స్టుట్గార్ట్)