న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్ 2018: ముందుకెళ్లాలంటే జపాన్ చెమటోడ్చాల్సిందే!

By Nageshwara Rao
FIFA World Cup 2018: Japan team, records, fixtures

హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో ఆరు రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్‌ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్‌ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్‌ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.

ఈ వరల్డ్ కప్‌‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.


దేశం: జపాన్


గ్రూపు H: సెనెగల్‌, పోలెండ్, జపాన్, కొలంబియా


వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 19: vs Colombia
June 24: vs Senegal
June 28: vs Poland


ఫిఫా ర్యాంకింగ్: 61


గత ప్రాతినిధ్యం: ఐదుసార్లు


ఉత్తమ ప్రదర్శన: 2002, 2010 టోర్నీల్లో ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌


స్టార్ ప్లేయర్లు: షిన్జి ఒకజాకి, కీసుకె హోండా, టకుమా అసానో


కోచ్: అకిర నిషినో


గత రికార్డులు:
No. of times team has played in WC (number): 5
No. of matches played (number): 17
No. of matches won: 4
No. of matches lost: 9
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 0
No. of goals scored in WC: 14


అంచనా: ఆసియా క్వాలిఫయింగ్స్‌లో సౌదీఅరేబియా, ఆస్ర్టేలియాను వెనక్కునెట్టి గ్రూప్‌లో అగ్రస్థానం దక్కించుకోవడం ద్వారా ఆరోసారి వరల్డ్‌క్‌పలో జపాన్‌ అదృష్టం పరీక్షించుకుంటోంది. జపాన్‌కు ఇది వరుసగా ఆరో ప్రపంచకప్‌. ఏ టోర్నీలోనూ రెండో రౌండ్‌ దాటని జపాన్‌.. ఈసారి చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉంది. అయితే అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉండటంతో ఈ జట్టు గ్రూప్‌ దశ దాటితే అద్భుతమే అని చెప్పాలి. ఒకవేళ సెనెగల్‌ మీద విజయం సాధించినా కూడా కొలంబియా, పోలెండ్‌ మీద నెగ్గడం చాలా చాలా కష్టం. అసాధారణ ప్రదర్శన చేస్తేనే అది సాధ్యం.

Story first published: Saturday, June 9, 2018, 13:49 [IST]
Other articles published on Jun 9, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X