Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్ 2018: కొలంబియాపై జయభేరీ మోగించిన జపాన్

FIFA World Cup 2018: Highlights: Sanchez red spoils Pekermans plans as Colombia fall to Japan

హైదరాబాద్: ఫిఫా ప్రపంచ కప్‌లో కొలంబియా జట్టు ఘోరమైన ఓటమికి గురైంది. గ్రూపు-హెచ్‌లో కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ 2-1తో గెలిచి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. గ్రూపు ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కొలంబియాపై అద్భుత పోరాటం ప్రదర్శించిన ఈ ఆసియా జట్టు ప్రథమార్థం ఆరంభంలోనే వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. 6వ నిమిషంలో జపాన్‌ మిడ్‌ఫీల్డర్‌ షింజి కజ్వా పెనాల్టీని గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.

కాగా అంతకుముందు మ్యాచ్‌ ఆరంభమైన మూడో నిమిషంలోనే పెనాల్టీ ప్రాంతంలో కొలంబియా ఆటగాడు కార్లొస్ సాంచెజ్‌ బంతిని ఉద్దేశపూర్వకంగా చేతితో అడ్డుకొన్నాడు. దీంతో రిఫరీ రెడ్‌కార్డు చూపించడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఫలితంగా జపాన్‌కు పెనాల్టీ అవకాశం వచ్చింది. ఆ తర్వాతి నుంచి మ్యాచ్‌ నువ్వానేనా అన్నట్లు సాగుతూ వచ్చింది.

బంతిని నియంత్రణలో ఉంచుకునేందుకు ఇరు జట్లు తీవ్రంగా పోటీపడినా.. బంతిని అదుపుచేయడంలో ఎక్కువ‌సేపు జపానే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ క్రమంలోనే 39వ నిమిషంలో కొలంబియా మిడ్‌ఫీల్డర్‌ క్విన్‌ట్రో నేరుగా ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచి 1-1కి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత ద్వితీయార్థంలోనూ మ్యాచ్‌ హోరాహోరీగానే ఆరంభమైంది.

అయితే 73వ నిమిషంలో జపాన్‌ ఫార్వర్డ్‌ర్‌ ఒసాకో హెడర్‌గోల్‌తో జపాన్‌ ఆధిక్యాన్ని 2-1కి చేర్చాడు. మ్యాచ్‌ను సమం చేయడానికి కొలంబియా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు మ్యాచ్‌ సమయం కూడా ముగియడంతో జపాన్‌ తొలిసారిగా కొలంబియాపై 2-1తో గెలిచినట్లయింది. దీంతో జపాన్ ప్రపంచ కప్ సెకండాఫ్‌కు ఉత్తీర్ణత సాధించినట్లే.

Story first published: Tuesday, June 19, 2018, 20:01 [IST]
Other articles published on Jun 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+