Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాకౌట్‌కు చేరిన కొలంబియా, నిష్కమించిన సెనెగల్

important winner for Colombia in the 74th minute

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్‌-హెచ్‌ పోరు ముగిసింది. ముందుగా సెనెగల్‌-కొలంబియా మధ్య జరిగిన పోరులో కొలంబియా 1-0తో విజయం సాధించి నాకౌట్‌కు చేరుకోగా, ఓటమితో సెనెగల్‌ టోర్నీ నుంచే నిష్ర్కమించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే ఆధిక్యత ప్రదర్శించిన కొలంబియా ఎక్కువ సేపు బంతిని నియంత్రణలో ఉంచుకొని ఎటాకింగ్‌ గేమ్‌ ఆడుతూ వచ్చింది.

మరోవైపు సెనెగల్‌ కూడా గట్టిపోటీ ఇస్తూనే ముందుకు సాగింది. కానీ తొలి అర్ధభాగం ముగిసే వరకూ ఇరు జట్లూ ఒక్కగోల్‌ కూడా నమోదు చేయలేకపోయాయి. అనంతరం మొదలైన రెండో అర్ధభాగంలోనూ కొలంబియా అదే జోరు కొనసాగించింది.

1
958064

ఈ క్రమంలోనే 74వ నిమిషంలో మినా హెడర్ గోల్‌తో కొలంబియాను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. స్కోరును సమం చేసేందుకు సెనెగల్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

కొలింబియా ఆటగాడు మినా హెడర్‌గోల్‌తో 1-0ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మరో గోల్‌ కోసం ఇరు జట్లూ ప్రయత్నించినా ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో 1-0తో కొలంబియా విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకోగా, సంచలనాల సెనెగల్‌ ఇంటిముఖం పట్టింది.

ఐతే పాయింట్ల పట్టికలో జపాన్, సెనెగల్ రెండు జట్లు అన్ని విభాగాల్లో సమానంగా ఉన్నప్పటికీ ఫెయిర్-ప్లే పాయింట్లను పరిగణనలోకి తీసుకోవడంతో జపాన్ నాకౌట్‌కు దూసుకెళ్లింది. నాకౌట్ మ్యాచ్‌లో కొలంబియా మరో ప్రత్యర్థి జూలై 3వ తేదీ మాస్కోలోని స్టార్టాక్ స్టేడియం వేదికగా తలపడుతుంది.

Story first published: Thursday, June 28, 2018, 23:19 [IST]
Other articles published on Jun 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+