Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పనామాని చిత్తు చేసి ప్రపంచకప్‌లో అదరగొట్టే బోణి చేసిన బెల్జియం

FIFA World Cup 2018 Highlights: Lukaku and Mertens

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం ఆరంభంలోనే అదరగొట్టింది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో పనామాని చిత్తుగా ఓడించి బెల్జియం ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచ కప్ బోణీ చేసి 3-0 స్కోరుతో ఖాతా తెరచింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన పనామా.. ఆఖరి వరకూ కనీసం ఒక గోల్‌ కూడా నమోదు చేయలేకపోయింది. బంతిని పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకున్న బెల్జియం పదే పదే పనామా గోల్‌పోస్టులపై దాడికి దిగింది. దీంతో ప్రపంచకప్‌లో బెల్జియం బోణికొట్టినట్లైంది.

తొలి అర్ధభాగం ఏ గోల్స్ చేయలేకపోయినా.. ద్వితీయార్థం మొదలైన రెండు నిమిషాల్లోనే డ్రైయిస్‌ మెర్టన్‌ తొలి గోల్‌ చేసి జట్టకు ఆధిక్యం అందజేశాడు. మ్యాచ్‌ 47వ నిమిషంలో మార్టెన్స్‌ గోల్ కొట్టి బెల్లియంకి 1-0తో ఆధిక్యం ఇవ్వగా.. 69వ నిమిషంలో లుకాకు కళ్లు చెదిరే గోల్‌తో ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. దీంతో.. పూర్తిగా ఆత్మరక్షణలోకి పడిపోయిన పనామా.. ఎదురుదాడికి ప్రయత్నించింది. కానీ.. బెల్లియం డిఫెన్స్‌ని ఛేదించలేకపోయింది.

1
958058

ఆ తర్వాత పనామా జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. ఈ దశలోనే 75వ నిమిషంలో మళ్లీ లుకకు గోల్‌తో పనామా ఓటమిని ఖాయం చేసేశాడు. మొత్తంగా మ్యాచ్‌లో గోల్‌ కోసం బెల్జియం 15 సార్లు ప్రయత్నించగా.. పనామా ఆరు సార్లు మాత్రమే ప్రయత్నించింది.

Story first published: Tuesday, June 19, 2018, 9:44 [IST]
Other articles published on Jun 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+