
హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. గ్రూప్-హెచ్‌లో సెనెగల్, జపాన్ మధ్య జూన్ 24న ఆదివారం జరిగిన మ్యాచ్ 2-2తో డ్రా ఫలితం వచ్చింది. మొదటి నుంచి బంతిని తన నియంత్రణలో ఉంచుకున్న సెనెగల్ ఎటాకింగ్ గేమ్ ఆడుతూ వచ్చింది. ఆఖరి నిమిషాల్లో అద్భుతమైన గోల్‌తో చెలరేగిన కియాసుకీ హోండా... ఫిఫా ప్రపంచకప్‌లో జపాన్‌ను గట్టెక్కించాడు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
జపాన్ తరఫున తకాషి ఇనుయ్ (34వ ని.), హోండా (78వ ని.) గోల్స్ చేయగా, సాడియో మానె (11వ ని.), మౌసా వాగ్ (71వ ని.) సెనెగల్‌కు గోల్స్ అందించారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో జపాన్, సెనెగల్ చెరో 4 పాయింట్లతో టాప్‌లో ఉన్నాయి. సెనెగల్ డిఫెండర్లు, ఫార్వర్డ్స్ సమన్వయంతో కదులుతూ ఆరంభంలోనే ఆధిక్యాన్ని సాధించారు.
11వ నిమిషంలో జపాన్ రైట్ వింగ్ బలహీనమైన పాస్‌లను మధ్యలోనే అడ్డుకున్న సెనెగల్ డిఫెండర్ యూసోఫ్ సాబ్లీ బంతిని బాక్స్‌లోని మానెకు అందించాడు. దీనిని లివర్‌పూల్ స్టార్ బలమైన కిక్‌తో గోల్‌పోస్ట్‌లోకి పంపి సెనెగల్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. 34వ నిమిషంలో ఇనుయ్ బాటమ్ కార్నర్ నుంచి బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ ఊహించని రీతిలో గోల్ పోస్ట్‌లోకి పంపి స్కోరును సమం చేశాడు.
ఇక ద్వితీయార్థంలో జపాన్ జట్టు కాస్త బలహీనంగా ఉండటంతో సెనెగల్ కుర్రాడు వాగ్ 71వ నిమిషంలో అద్భుతం చేశాడు. ఆరడగుల నుంచి కొట్టిన షాట్ జపాన్ గోలీని దాటుకుని వెళ్లడంతో సెనెగల్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌లో ఓటమి తప్పదేమో అనుకుంటున్న తరుణంలో, మరో 12 నిమిషాల్లో ముగుస్తుందనగా సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హోండా తన ఆరు నిమిషాల ఆటలో సెనెగల్ డిఫెన్స్‌పై ఎదురుదాడి చేశాడు. ఫలితంగా చివరి నిమిషాల్లో లెఫ్ట్ వింగ్ నుంచి అతను కొట్టిన క్రాస్ పాస్ సెనెగల్ గోలీలోకి రాకెట్‌లా దూసుకెళ్లడంతో జపాన్ బ్రతికిపోయింది.