న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫ్రాన్స్ నాకౌట్‌కు.. పెరూకు రెండో సారి పరాజయం

mbappe-book-last-16-spot-with-record-goal

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ నాకౌట్‌కు చేరుకుంది. గ్రూపు-సి లో పెరూతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో విజయం సాధించింది. పెరూతో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆరంభం నుంచే ఇరు జట్లు పోటాపోటీగా గోల్‌ కోసం ప్రయత్నించాయి. 34వ నిమిషంలో ఫ్రాన్స్‌ మిడ్‌ఫీల్డర్‌ బప్పే గోల్‌ కొట్టి ఫ్రాన్స్‌కి ఆధిక్యత అందించాడు. ఆ తర్వాత మ్యాచ్‌ ద్వితీయార్థంలో ఎవరూ గోల్‌ చేయకపోవడంతో ఫ్రాన్స్‌ 1-0తో గెలిచి నాకౌట్‌కు చేరింది.

ఫిఫా ప్రపంచకప్‌ 2018 సీజన్‌లో వరుసగా రెండో విజయం సాధించిన ఫ్రాన్స్‌ జట్టు నాకౌట్ దశకి చేరుకుంది. దీంతో.. టోర్నీలో వరుసగా రెండో ఓటమిని చవిచూసిన పెరూ జట్టు పోరాటం దాదాపు ముగిసింది. మ్యాచ్‌ 34వ నిమిషంలో గోల్‌ చేసిన కైలియన్ ఫ్రాన్స్‌కి 1-0తో ఆధిక్యం అందించాడు.

1
958036

మ్యాచ్ 82వ నిమిషంలో గిరౌడ్ స్థానంలో ఉస్మన్ డెంబెలె సబ్‌స్టిట్యూట్‌గా దిగాడు. పెరూ జట్టుకు చెందిన గురెరో ఫ్రీ కిక్‌ను గోల్ చేయడానికి ఆలస్యం చేయడంతో లాభం లేకుండా పోయింది

ఆ తర్వాత పెరూ జట్టు ఆధిక్యాన్ని సమం చేసేందుకు చివరి వరకూ ప్రయత్నించినా లాభం లేకపోయింది. మ్యాచ్ మొత్తం‌లో సగానికి పైగా బంతిని తన నియంత్రణలోనే ఉంచుకున్న పెరూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాదాపు 10 సార్లు ఫ్రాన్స్‌ గోల్‌పోస్టుపై దాడి చేసినా విజయవంతం కాలేకపోయింది. ఇప్పటికే టోర్నీ నాకౌట్‌లోకి ఉరుగ్వే, రష్యా జట్లు అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Story first published: Thursday, June 21, 2018, 23:08 [IST]
Other articles published on Jun 21, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X