డెన్మార్క్ vs ఫ్రాన్స్: గేమ్ ముగిసినా సున్నా స్కోరే.. అయినా డ్రా

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో గ్రూప్-సి పోరు ఆసక్తికరంగా ముగిసింది. ఈ గ్రూప్‌లో అగ్రస్థానం కోసం సాగిన డెన్మార్క్-ఫ్రాన్స్ పోరు గోల్ లేని డ్రాగా ముగిసింది. ఇలా ఈ ప్రపంచకప్‌లో గోల్ లేని డ్రాగా ముగిసిన తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. దీంతో మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా అగ్రస్థానంలో ఉన్న ఫ్రాన్స్, రెండోస్థానంలో ఉన్న డెన్మార్క్ నేరుగా నాకౌట్‌కు చేరుకున్నాయి. పాత రికార్డు పరంగా చూసుకుంటే మాజీ ఛాంపియన్ ఫ్రాన్స్‌నే ఫేవరెట్‌గా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు గోల్ కోసం మొదటి నుంచే ఎటాకింగ్ గేమ్‌ను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఫ్రాన్స్ మరింత దూకుడుగా ఆడుతూ బంతిని ఎక్కువ సేపు నియంత్రణలో ఉంచుకుంది. కానీ గోల్ మాత్రం నమోదు చేయలేకపోయింది. ఎక్కువసార్లు గోల్ కోసం ఎటాక్ చేసినా.. తొలి అర్ధభాగంలో ఒక్క గోల్ కూడా నమోదుకాలేదు.
రెండో అర్ధభాగంలోనైనా ఖాతా తెరవాలనుకున్న ఫ్రాన్స్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. డెన్మార్క్ గోల్ పోస్టుపై ఫ్రాన్స్ ఆటగాళ్లు పదేపదే దాడి చేసినా ఫలితం దక్కలేదు. మరోవైపు మ్యాచ్ సమయం కూడా పూర్తి కావడంతో ఈ ప్రపంచకప్‌లో తొలిసారిగా గోల్ లేని డ్రాగా మ్యాచ్ ముగిసింది. మరోవైపు ఇదే గ్రూప్‌లో ఆస్ట్రేలియా-పెరూ మ్యాచ్‌లో పెరూ విజేతగా నిలిచింది. మ్యాచ్ ఆరంభమైన 18వ నిమిషంలోనే పెరూ ఆటగాడు కార్రెల్లో తన జట్టుకు తొలి గోల్ అందించాడు.
దీంతో తొలి అర్ధభాగాన్ని పెరూ 1-0 ఆధిక్యంతో పూర్తి చేసింది. ఆ తర్వాత మొదలైన రెండో అర్ధభాగంలోనూ పెరూ జోరు కొనసాగించింది. 50నిమిషంలో పెరూ ఫార్వర్డ్‌ర్ గుర్రెరో మరో గోల్ అందించి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. మ్యాచ్ గెలిచినప్పటికీ పెరూ మాత్రం నాకౌట్ చేరలేకపోయింది. బంతి ఎక్కువ సేపు ఆస్ట్రేలియా నియంత్రణలో ఉన్నా ఫలితం మాత్రం పెరూకే అనుకూలంగా వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications