Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొదటిది డ్రా.. రెండో మ్యాచ్ లో 2గోల్స్‌తో బ్రెజిల్ విజయం

FIFA World Cup 2018 Highlights: Brazil 2 Costa Rica 0

హైదరాబాద్: ఆఖరి క్షణాల్లో అనూహ్యంగా గోల్ సాధించి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది బ్రెజిల్ జట్టు. ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్‌ను పేలవంగా ఆరంభించిన ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ టోర్నీలో దూకుడు పెంచింది. గ్రూప్-ఈలో భాగంగా స్విట్జర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ను బ్రెజిల్ 1-1తో డ్రాగా ముగించిన విషయం తెలిసిందే.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

గ్రూప్-ఈలో భాగంగా కొస్టారికాతో మ్యాచ్‌లో ఛాంపియన్ ఆటను ప్రదర్శించింది. ప్రత్యర్థి నిలువరించినా ఆఖరి నిమిషం వరకు పోరాడి 2-0గోల్స్‌తో విజయం సాధించింది. కోస్టారికా ఫిఫా ర్యాంకు 25. చిన్న దేశమే కానీ ఆటలో తక్కువేం కాదని కోస్టారికా నిరూపించింది. రెండో ర్యాంకు సాంబా జట్టును ముప్పతిప్పలు పెట్టింది.

FIFA World Cup 2018 Highlights: Brazil 2 Costa Rica 0

మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు గోల్ చేసేందుకు పోటీపడ్డాయి. బ్రెజిల్‌పై వ్యూహాలను చిత్తుచేస్తూ కోస్టారికా గట్టి పోటీనిచ్చింది. తొలి సెషన్‌లో ఎవరూ గోల్ చేయకపోవడంతో 0-0తో ముగిసింది. రెండో సెషన్ కొంత ఆసక్తికరంగా సాగింది. 72వ నిమిషంలో వచ్చిన గొప్ప అవకాశాన్ని నెయ్‌మార్ వృథా చేశాడు. అతడు తన్నిన బంతి గోల్‌పోస్ట్‌కు పక్కగా వెళ్లింది. బ్రెజిల్ ప్రత్యర్థి పోస్ట్‌పై గోల్‌కు ప్రయత్నించే క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు గాయాలపాలయ్యారు.

రిఫరీ ఎల్లోకార్డు కూడా చూపించాడు. 90వ నిమిషంలో ఫిలిప్ కౌటినో అద్బుత గోల్‌తో బ్రెజిల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఆ తరువాత ఇంజురీ సమయంలో వరల్డ్ స్టార్ నెయ్‌మార్ కొట్టిన గోల్‌తో బ్రెజిల్ 2-0 ఆధిక్యంతో మ్యాచ్ ముగించింది. చివరి వరకు కోస్టారికా గట్టిగానే పోరాడినా ఓటమి తప్పలేదు. చివరి క్షణాల్లో పట్టువిడవడంతో వచ్చిన అవకాశాన్ని బ్రెజిల్ అందిపుచ్చుకుంది.

Story first published: Friday, June 22, 2018, 20:00 [IST]
Other articles published on Jun 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+