
హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో తొమ్మిది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.
ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.

దేశం: ఫ్రాన్స్
గ్రూపు C: ఫ్రాన్స్, డెన్మార్క్, పెరూ, ఆస్ట్రేలియా
వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 16: vs Australia
June 21: vs Peru
June 26: vs Denmark
ఫిఫా ర్యాంకింగ్: 7
వరల్డ్‌కప్‌లో ప్రాతినిథ్యం: 14సార్లు
స్టార్ ప్లేయర్లు: ఆంటోయిన్ గ్రీజ్‌మన్, నోలో కాంటే
అత్యుత్తమ ప్రదర్శన: 1998 చాంపియన్లు, 2006 రన్నరప్
కోచ్: డిడియర్ డెస్ఛాంప్స్
గత రికార్డులు:
No. of matches played (number): 59
No. of matches won: 28
No. of matches lost: 19
No. of times lost in finals (Number): 1
No. of times world cup won (number): 1
No. of goals scored in WC: 106
అంచనా: గ్రూప్ టాపర్. సెమీస్‌కు చేరే అవకాశం. యూరప్ క్వాలిఫయర్స్ గ్రూప్-బిలో నెదర్లాండ్స్, స్వీడన్‌లతో తలపడిన ఫ్రాన్స్ అగ్ర స్థానంలో నిలిచింది. గ్రూప్-సిలో అత్యంత గట్టిజట్టు ఫ్రాన్స్. పలువురు మేటి ఆటగాళ్లతో కూడిన ఫ్రాన్స్ టోర్నీ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.