ఫిఫా వరల్డ్‌కప్: సోనీకి రూ. 200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది


హైదరాబాద్: రష్యా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ భారత్‌లోనూ సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పుట్‌బాల్ అభిమానులు 21వ ఫిఫా వరల్డ్‌కప్‌ను బాగా ఆదరించారు. టోర్నీలోని ప్రతి మ్యాచ్‌ను చూసి సంబరాలు చేసుకున్నారు.
మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జులై 15న ఫ్రాన్స్-క్రొయేషియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కైతే భారత్‌లోని సాకర్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు ఏ అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు భారత్‌లో ఇంత ఆదరణ దక్కలేదట. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా వెల్లడించింది.

భారత్‌లో రికార్డు స్థాయిలో వీక్షణ
రికార్డు స్థాయిలో ఈ మ్యాచ్‌ని వీక్షించినట్లు పేర్కొంది. రష్యా వేదికగా జూన్ 14న ప్రారంభమైన ఫిఫా వరల్డ్‌కప్ జులై 15తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ మొత్తాన్ని భారత్‌లో 254 మిలియన్ల మంది వీక్షించారట. ఫ్రాన్స్-క్రొయేషియా మధ్య జరిగిన ఫైనల్‌ను మాత్రం ఏకంగా 51.2మిలియన్ల మంది చూడటం గమనార్హం.

సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ సంతోషం
రికార్డు స్థాయిలో వీక్షకుల నుంచి వచ్చిన స్పందనకు గాను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. "భారత దేశ వ్యాప్తంగా 110.5మిలియన్ల మంది మొత్తం 64 మ్యాచ్‌లను లైవ్‌లో చూశారు. ఫుట్‌బాల్ అంటే పశ్చిమ బెంగాల్ వాసులకు ఎంతో ఆసక్తి. అత్యధికంగా మ్యాచ్‌లను వీక్షించిన రాష్ట్రాలను పరిశీలిస్తే 22.2మిలియన్ల మందితో పశ్చిమ్ బెంగాల్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో కేరళ (17.8మిలియన్లు) ఉంది" అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
* West Bengal - 22.2 mn
* Kerala - 17.8 mn
* Maharashtra /Goa - 12.8 mn
* Assam/North East/Sikkim - 11.4 mn

స్థానిక భాషల్లో సైతం అద్భుత స్పందన
గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిఫా వరల్డ్‌కప్‌ను స్థానిక భాషలైన (హిందీ, మళయాళం, బెంగాల్, తమిళం, తెలుగు)లో ఫీడ్ అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని బాషలకు గాను 70.7 మిలియన్ వీక్షకులు వీక్షించారట. 66 శాతం మంది మొత్తం టోర్నీని వీక్షించారట.

అగ్రస్థానంలో బెంగాల్
స్థానిక భాషల్లో బెంగాల్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో మళయాళం ఉంది. 47శాతం మంది మహిళా అభిమానులు సైతం ఫిఫా వరల్డ్ కప్‌పై ఆసక్తి కనబర్చడం విశేషం. క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ విజయం సాధించి వరల్డ్‌కప్‌ను రెండోసారి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే నెల రోజుల పాటు జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ద్వారా సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా సుమారు రూ. 200 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఈ నెల రోజుల పాటు 40కి పైగా ఎడ్వటైజర్లు సోనీని సంప్రదించారు. 2014లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ద్వారా సోనీ రూ. 100 ఆర్జిస్తే ఇప్పుడు దానికి డబుల్ ఆర్జించింది.
"రష్యా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌కు వచ్చిన రెస్పాన్స్ సూపర్బ్. పది సెకన్ల పాటు నిడివి ఉన్న యాడ్‌కు సోనీ రూ. 6 లక్షలు వసూలు చేసింది. ఈ ఫిగర్ నిజానికి ఎడ్వటైజర్లను ఎంకరేజ్ చేసేలా ఉంది" అని సోనీ నెట్‌వర్క్ సేల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా వెల్లడించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications