For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది..!!

FIFA World Cup 2018 Final: Croatia’s Road to the Final

హైదరాబాద్: రష్యాలో జరుగుతోన్న ఫిఫా ప్రపంచకప్‌‌లో క్రీడా ప్రపంచాన్ని నెల రోజులపాటు ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్‌కు దూసుకెళ్లిన మొదటి జట్టు ఫ్రాన్స్‌. ఆదివారం ఫ్రాన్స్‌-క్రొయేషియా మధ్య మెగా ఫైనల్‌ జరగనుంది. భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన బ్రెజిల్, జర్మనీ, పోర్చుగల్, అర్జెంటీనా, స్పెయిన్ లాంటి జట్లు అనూహ్య ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించగా.. అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తూ ఫ్రాన్స్, క్రొయేషియా జట్లు ఫైనల్‌‌కి చేరాయి.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

ఫ్రాన్స్ జట్టే ఫేవరెట్‌గా బరిలోకి

ఫ్రాన్స్ జట్టే ఫేవరెట్‌గా బరిలోకి

ఆదివారం రాత్రి 8.30 గంటలకి ఈ రెండు జట్ల మధ్య కప్‌ కోసం తుదిపోరు జరగనుంది. ఇప్పటి వరకు ఫ్రాన్స్, క్రొయేషియా జట్లు ఐదు సార్లు తలపడగా.. మూడుసార్లు ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ నేపథ్యంలో.. ఫ్రాన్స్ జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే.. క్రొయేషియా జట్టు తాజా టోర్నీలో పెద్ద జట్లకి షాకివ్వడం అలవాటుగా చేసుకుంది. దీనికి తోడు.. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్రతి 20 ఏళ్లకి ఒకసారి కొత్త ఛాంపియన్‌ జట్టు పుట్టుకొస్తోంది.

 క్రొయేషియా ఫైనల్‌కి చేరడం ఇదే తొలిసారి

క్రొయేషియా ఫైనల్‌కి చేరడం ఇదే తొలిసారి

1958లో బ్రెజిల్ ఆ తర్వాత 20 ఏళ్లకి అర్జెంటీనా.. ఆ తర్వాత ఫ్రాన్స్‌ కొత్త విజేతలుగా అవతరించాయి. దీంతో.. క్రొయేషియా ఈసారి కొత్త విజేతగా నిలుస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. 1998లో ప్రపంచకప్ గెలిచిన ఫ్రాన్స్.. ఆ తర్వాత 2006లోనూ ఫైనల్‌కి చేరింది. కానీ.. ఆ టోర్నీలో ఇటలీ చేతిలో అనూహ్యంగా ఓడి కొద్దిలో కప్‌ని చేజార్చుకుంది. మరోవైపు క్రొయేషియా ఫైనల్‌కి చేరడం ఇదే తొలిసారి.

ఆటగాళ్లు ధరించే ముదురు నీలం రంగు జెర్సీలను:

ఆటగాళ్లు ధరించే ముదురు నీలం రంగు జెర్సీలను:

మరోపక్క చూస్తే.. ఫ్రాన్స్‌కు మద్దతిచ్చేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు ఆటగాళ్లు ధరించే ముదురు నీలం రంగు జెర్సీలకు పారిస్‌లో భారీగా డిమాండ్‌ పెరిగింది. ఆటగాళ్ల జెర్సీలు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తమ అభిమాన ఆటగాళ్ల జెర్సీలను సొంతం చేసుకునే పనిలో పడిపోయారు. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని వస్త్ర దుకాణాల్లో ఆ దేశ ఆటగాళ్ల జెర్సీలను కొనేందుకు అభిమానులు దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు.

స్థానిక రెస్టారెంట్లు, బార్లు కూడా నీలం రంగు విద్యుద్దీపాల వెలుగులతో

స్థానిక రెస్టారెంట్లు, బార్లు కూడా నీలం రంగు విద్యుద్దీపాల వెలుగులతో

‘ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల జెర్సీలు కావాలంటూ పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లు గోలో కంటే, క్లియాన్‌ పేరున్న జెర్సీలు కావాలని అభిమానులు అడుగుతున్నారు. ఇప్పటికే చాలా షర్టులు విక్రయించాం. ఇంకా చాలా ఆర్డర్లు‌ ఇచ్చాం.' అని స్టోర్ల యజమానులు తెలిపారు. అలాగే స్థానిక రెస్టారెంట్లు, బార్లు కూడా నీలం రంగు విద్యుద్దీపాల వెలుగులతో ధగధగలాడుతున్నాయి. విద్యుద్దీపాలంకరణ వెలుగుల్లో పారిస్‌ నగరం మరింత ఆకర్షణీయంగా మారింది.

Story first published: Sunday, July 15, 2018, 15:32 [IST]
Other articles published on Jul 15, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+