ఫిఫా వరల్డ్ కప్‌లో బూతులు: మహిళా అభిమానుల అసభ్య చేష్టలు

హైదరాబాద్: రష్యా వేదికగా జరగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో దక్షిణ అమెరికా అభిమానుల ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన మహిళా అభిమానుల పట్ల వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిఫా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా విదేశీ మహిళలతో ఆ అభిమానులు వారికి తెలియని భాషలో బూతులు అనిపించడంతోపాటు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియలో చర్చనీయాంశమైంది.

ఓ మహిళ చుట్టూ మూగి పోర్చుగల్ భాషలో
బ్రెజిల్‌కు చెందిన కొంతమంది పురుష అభిమానులు ఓ మహిళ చుట్టూ మూగి పోర్చుగల్ భాషలో ఆమె శరీర భాగాలను అసభ్యంగా వర్ణించేలా నినదిస్తూ ఆమె కూడా అలా చేయాలని బలవంతం చేయడం ఆ వీడియోల్లో కనిపించింది.
కొలంబియన్లు మితిమీరి..
ఇక, కొలంబియాకు చెందిన కొందరు అభిమానులు స్పానిష్ భాషలో తనను తాను అసభ్యంగా వర్ణించుకొనేలా ఓ స్త్రీని ప్రోత్సహించారు. మెక్సిన్ అభిమానుల గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. వరల్డ్ కప్‌లో ఈ అభిమానులు తీరు మరీ దారుణంగా ఉంది.

స్పానిష్ భాషలో స్త్రీ అంగాలపై అసభ్యంగా
ఓ మహిళను గాలిలో ఎత్తుకొని స్పానిష్ భాషలో స్త్రీ అంగాలపై అసభ్యంగా నినదింపేలా చేయడం అందరినీ నివ్వెరపరిచింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతోపాటు అంతర్జాతీయ మీడియా సైతం వీటిని ప్రచురించింది. వాటిల్లో తమ ఉద్యోగులు ఉండడం గమనించిన బ్రెజిల్ యజమానులు విస్మయానికి గురయ్యారు.
చర్యలు తీసుకుంటాం
అంతేకాదు వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో మహిళల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం ఎంత మాత్రం మంచిది కాదని జపాన్ విదేశాంగ శాఖ సూచిస్తూ కొలంబియా అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications