
హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో తొమ్మిది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.

ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.
దేశం: ఈజిప్ట్
గ్రూపు A: రష్యా, ఉరుగ్వే, సౌదీ అరేబియా, ఈజిప్ట్
వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 15: vs Uruguay
June 19: vs Russia
June 25: vs Saudi Arabia
ఫిఫా ర్యాంకింగ్: 46
బెస్ట్ ఫినిష్: గతంలో రెండుసార్లు మాత్రమే ప్రపంచకప్‌లో ఆడింది. గ్రూప్ దాటలేదు.
స్టార్ ప్లేయర్లు: మహ్మద్ సలా, అబ్దుల్లా.
కోచ్: హెక్టర్ కూపర్.
గత రికార్డులు:
No. of times team has played in WC (number): 2
No. of matches played (number): 4
No. of matches won: 0
No. of matches lost: 2
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 0
No. of goals scored in WC: 3
అంచనా: 1990 తర్వాత తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్నా ఈజిప్ట్ ఈసారి మాత్రం ఆసక్తిరేపుతోంది. బలమైన డిఫెన్స్ ఈ జట్టు సొంతం. గ్రూప్‌లో ఫేవరెట్ ఉరుగ్వేనే అయినా.. ఈజిప్ట్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న లివర్‌పూల్ ఆటగాడు మో సలా ఈజిప్ట్‌కు పెద్ద బలం. క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రిమియర్ లీగ్‌లోనూ విశేషంగా రాణించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. గ్రూప్ నుంచి రెండో స్థానంతో రెండో రౌండ్‌కు అర్హత సాధించడం ఖాయం.