
హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో తొమ్మిది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.
ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.
ఇక, ఐరోపాలో వేగంగా ఎదుగుతున్న ఫుట్‌బాల్ జట్లలో డెన్మార్క్ ఒకటి. 2012 యూరోపియన్ ఛాంపియన్‌షిప్ తర్వాత ఆ జట్టు పెద్ద టోర్నీలు ఆడలేదు. అయితే అర్హత పోటీల్లో డెన్మార్క్ తన మార్క్ చూపించింది. వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచి ఔరా అనిపించింది. అందులో టాప్‌సీడ్ పొలెండ్‌పై వాళ్ల ఆట అద్భుతం.
గ్రూప్-సి నుంచి నాకౌట్‌కు వెళ్లే జట్లలో డెన్మార్క్ కూడా ఉంటుందనేది నిపుణుల అంచనా. ఎరిక్‌సన్‌పైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. 2010 ప్రపంచకప్‌లో 18 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ఎరిక్‌సన్ ఇప్పుడు సీనియర్ ఆటగాడిగా, జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవల డెన్మార్క్ తరఫున ఎనిమిదో మ్యాచ్‌ల్లో 11 గోల్స్ కొట్టాడు.

దేశం: డెన్మార్క్
గ్రూపు C: ఫ్రాన్స్, డెన్మార్క్, పెరూ, ఆస్ట్రేలియా
వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 16: vs Peru
June 21: vs Australia
June 26: vs France
ఫిఫా ర్యాంకింగ్: 12
వరల్డ్‌కప్‌లో ప్రాతినిథ్యం: నాలుగుసార్లు
అత్యుత్తమ ప్రదర్శన: 1998లో క్వార్టర్‌ఫైనల్స్
స్టార్ ప్లేయర్లు: మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్ ఎరిక్‌సన్, రైట్‌వింగర్ పియోన్ సిస్టో
అత్యుత్తమ ప్రదర్శన: ఐదుసార్లు ప్రపంచకప్ ఆడింది. 1998లో క్వార్టర్స్ చేరడం ఉత్తమం.
కోచ్: ఏజ్ హరెడె
గత రికార్డులు:
No. of times team has played in WC (number): 4
No. of matches played (number): 25
No. of matches won: 8
No. of matches lost: 6
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 0
No. of goals scored in WC: 27
అంచనా: క్వాలిఫియర్స్ మ్యాచ్‌లో క్రిస్టియన్ ఎరిక్సన్ హ్యాట్రిక్‌తో ఐర్లాండ్‌పై అద్భుత విజయంతో వరల్డ్‌కప్ బెర్త్ ఖరారు చేసుకున్న డెన్మార్క్.. ఈసారి సంచలనాలు సృష్టించాలని పట్టుదలగా ఉంది. పెరూ నుంచి తీవ్ర పోటీ ఉన్నా గ్రూప్‌లో రెండో స్థానంలో నిలవొచ్చు. ఆ తర్వాత ప్రీక్వార్టర్స్ దాటకపోవచ్చు.