
హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో తొమ్మిది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.
ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.
దేశం: క్రొయేషియా
గ్రూపు D: క్రొయేషియా, నైజీరియా, అర్జెంటీనా, ఐస్‌లాండ్
వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 16: vs Nigeria
June 21: vs Argentina
June 26: vs Iceland
ఫిఫా ర్యాంకింగ్: 18
బెస్ట్ ఫినిష్: 1998లో 3వ స్థానం
వరల్డ్‌క్‌పలో ప్రాతినిథ్యం: 4
స్టార్ ప్లేయర్లు: లుకా మోడ్రిక్, ఇవాన్ పెరిసిక్, డెజాన్ లొవ్రెన్
కోచ్: జ్లాట్కో దలిచ్
గత రికార్డులు:
No. of times team has played in WC (number): 4
No. of matches played (number): 16
No. of matches won: 7
No. of matches lost: 7
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 0
No. of goals scored in WC: 21
అంచనా: గ్రూపు డిలో అర్జెంటీనాకు అతి పెద్ద ముప్పు క్రొయేషియాతోనే. క్వాలిఫయర్స్‌లో చివరి ప్లే ఆఫ్‌లో గ్రీస్‌పై చక్కటి విజయంతో వరల్డ్ కప్ బెర్త్ ఖాయం చేసుకుంది. కెప్టెన్ లుకా మోడ్రిక్, ఇవ్‌నా రాక్‌టిక్, మార్సిలో బ్రొజోవిక్‌లు మిడ్‌ఫీల్డ్ రాణించే తీరుపైనే క్రొయేషియా వరల్ద్‌కప్ పయనం ఆధారపడి ఉంది.