న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్ 2018: సంచలన ప్రదర్శనే లక్ష్యంగా కొలంబియా

By Nageshwara Rao
FIFA World Cup 2018: Colombia team, records, fixtures

హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో ఆరు రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్‌ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్‌ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్‌ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.

ఈ వరల్డ్ కప్‌‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.


దేశం: కొలంబియా


గ్రూపు H: జపాన్, సెనెగల్, కొలంబియా, పోలాండ్


వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 19: vs Japan
June 24: vs Poland
June 28: vs Senegal


ఫిఫా ర్యాంకింగ్: 16


ఉత్తమ ప్రదర్శన: 2014లో క్వార్టర్‌ఫైనల్‌.


స్టార్ ప్లేయర్లు: జేమ్స్‌ రోడ్రిగెజ్‌, ఫాల్కోవ్‌, కార్లోస్‌ బాకా


కోచ్: పెకెర్మన్‌


గత రికార్డులు:
No. of times team has played in WC (number): 5
No. of matches played (number): 18
No. of matches won: 7
No. of matches lost: 9
No. of times lost in finals (Number): 0
No. of times world cup won (number): 0
No. of goals scored in WC: 26


అంచనా: క్వాలిఫయింగ్‌ టోర్నీలో మేటి జట్ల చేతిలో పరాజయం పాలైనా బలహీన జట్లపై గెలవడం ద్వారా రష్యా వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. 2014లో బ్రెజిల్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన ఆటతీరుతో కొలంబియా క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ఈ సారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేసి ఈ ప్రపంచకప్‌ను మెరుగైన స్థానంతో ముగించాలని అనుకుంటోంది. అనామకుడిగా గత వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టి అత్యధిక గోల్స్‌తో గోల్డెన్‌ బూట్‌ అవార్డు గెలుచుకున్న జేమ్స్‌ రోడ్రిగెజ్‌ జట్టులో కీలకం కానున్నాడు. వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన కోచ్‌ జోస్‌ ఆధ్వర్యంలో జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి మరి.

Story first published: Saturday, June 9, 2018, 15:25 [IST]
Other articles published on Jun 9, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X