
హైదరాబాద్: సమయం చాలా తక్కువగా ఉంది. మరో తొమ్మిది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
రష్యా అతిథ్యమిస్తోన్న ఈ ఫిఫా వరల్డ్ కప్ నెలరోజుల పాటు అంటే జూన్ 14 నుంచి జులై 15 వరకు అభిమానులను అలరించనుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. నాలుగేసి జట్లు.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తొలి దశలో తలపడుతున్నాయి. ఫేవరెట్ ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
వాస్తవానికి క్వాలిఫయిర్స్ టోర్నీని దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికొచ్చే ప్రతి జట్టూ నాణ్యమైనదే. కాబట్టి గ్రూప్ దశ అంత ఆషామాషీగా ఏమీ ఉండదు. ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి ఫలితమూ ఉత్కంఠభరితంగానే ఉండబోతోంది.
ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ, బ్రెజిల్ జట్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. అర్జెంటీనా, స్పెయిన్, బెల్జియం లాంటి జట్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వరల్డ్ కప్ రేసులో ఉన్నాయి. జూన్ 14న మాస్కోలోని లుజుంకి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా.. సౌదీ అరేబియాతో తలపడనుంది.
దేశం: బ్రెజిల్
గ్రూపు E: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కోస్టారికా
వరల్డ్ కప్ మ్యాచ్‌లు:
June 17: vs Switzerland
June 22: vs Costa Rica
June 27: vs Serbia
ఫిఫా ర్యాంకింగ్: 2
గత వరల్డ్ కప్‌లో అత్యుత్తమం:: ఫైనల్
బెస్ట్ ఫినిష్: విన్నర్స్ (1958, 1962, 1970, 1994, 2002)
స్టార్ ప్లేయర్లు: నెయమార్, రోబెర్టో ఫిర్మినో, ఫిలిఫ్పీ కౌంటిన్హో, పౌలిన్హో
కోచ్: అడెనార్ లియోనార్డో బాచి
గత రికార్డులు:
No. of times team has played in WC (number): 20
No. of matches played (number): 104
No. of matches won: 70
No. of matches lost: 17
No. of times lost in finals (Number): 7
No. of times world cup won (number): 5
No. of goals scored in WC: 221
అంచనా: రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ గ్రూపులో ఉన్న కోస్టారికా, సెర్బియా, స్విట్జర్లాండ్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ లీగ్ స్టేజి నుంచి బ్రెజిల్ అత్యుత్తమ ప్రదర్శన చేసే అవకాశం ఉంది.