న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా: రష్యా వరల్డ్ కప్‌లో 'మూడు' ఎవరిదో?

By Nageshwara Rao
 FIFA World Cup 2018, Belgium vs England Preview: Bronze medal now the minimum for Meunier

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో మూడో స్థానం కోసం శనివారం బెల్జియం-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్‌, బెల్జియం జట్లు సెమీ‌స్‌కు దూసుకెళ్లాయి. అయితే, కీలక సెమీఫైనల్స్‌లో తడబడి భారీ మూల్యం చెల్లించుకున్నాయి.

సెమీస్‌లోకి అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌ను క్రొయేషియా అదనపు సమయంలో మట్టికరిపించగా, ఫ్రాన్స్‌ చేతిలో బెల్జియంకు చావుదెబ్బ ఎదురైంది. దీంతో శనివారం జరిగే ఈ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు టోర్నీని మూడో స్థానంతోనైనా ముగించాలన్న పట్టుదలతో ఉన్నాయి.

లీగ్ దశలో తమకు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంగ్లిష్ జట్టు సిద్ధమైతే.. మరోమారు తమ సత్తాచాటాలన్న కసితో బెల్జియం ఉంది. దీంతో శనివారం రాత్రి 7.30 గంటలకు మాస్కోలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేడియం అభిమానుల ఈలలు, కేరింతలతో హోరెత్తనుంది.

1
958084
రెండు జట్లూ గ్రూప్‌ ‘జి’కి చెందినవే

రెండు జట్లూ గ్రూప్‌ ‘జి’కి చెందినవే

ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రెండు జట్లూ గ్రూప్‌ ‘జి'కి చెందినవే. తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై బెల్జియం నెగ్గింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ప్రతీకారం కోసం చూస్తోంది. క్రొయేషియాతో సెమీఫైనల్ మ్యాచ్‌లో అనూహ్య ఓటమితో ఫైనల్ అవకాశాలను చేజార్చుకున్న ఇంగ్లండ్.. అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. తమ కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న క్రొయేషియాను తక్కువ అంచనా వేసిన ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుంది.

విజయం సాధించాలనే పట్టుదలతో ఇంగ్లాండ్

విజయం సాధించాలనే పట్టుదలతో ఇంగ్లాండ్

దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇంగ్లాండ్ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. నిజానికి ఏ జట్టూ ఈ స్థానం కోసం పోటీపడడానికి ఇష్టపడదని, కానీ తమ పోరాటంలో అలక్ష్యం ఉండదని ఇంగ్లండ్‌ కోచ్‌ గ్యారెత్‌ సౌత్‌గేట్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు జట్టులోని 23 మంది ఆటగాళ్లలో ఇద్దరు రిజర్వ్‌ గోల్‌కీపర్లు తప్ప అంతా టోర్నీలో ఆడారు.

ఈ మ్యాచ్‌లో మార్పులుండే అవకాశం

ఈ మ్యాచ్‌లో మార్పులుండే అవకాశం

అయితే, ఇప్పుడు ఈ మ్యాచ్‌లో మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. వాల్కర్‌, హెండర్సన్‌, ట్రిప్పీర్‌ గాయాలతో బాధపడుతున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ అలసట కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడడం అనుమానంగానే ఉంది. అయితే తాను ఫిట్‌గానే ఉన్నట్టు అతడు ప్రకటించినా కోచ్‌పై తుది నిర్ణయం ఆధారపడి ఉంది.

మరోవైపు అద్భుత డిఫెన్స్‌ కలిగిన బెల్జియం

మరోవైపు అద్భుత డిఫెన్స్‌ కలిగిన బెల్జియం

మరోవైపు అద్భుత డిఫెన్స్‌ కలిగిన బెల్జియం ఈ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోవడం లేదు. టోర్నీ మొత్తమ్మీద బెల్జియంకు సానుకూల ఫలితాలు దక్కాయి. సెమీస్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓటమి మినహా బెల్జియం జట్టు అంచనాలకు మించి రాణించింది. కలల కప్‌ను కైవసం చేసుకోవాలన్న తలంపుతో టోర్నీలో అడుగుపెట్టిన బెల్జియం.. మ్యాచ్ మ్యాచ్‌కు పరిణితి సాధించింది.

టాప్‌-3పై కన్నేసిన బెల్జియం

టాప్‌-3పై కన్నేసిన బెల్జియం

ఫ్రాన్స్‌తో మ్యాచ్‌లో బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుకున్నా.. గోల్‌ చేయలేక పోయింది. ఇంగ్లాండ్‌లాగా ఎలాంటి ప్రయోగాలకూ వెళ్లకుండా తమ పూర్తి జట్టుతోనే బరిలోకి దిగనుంది. ‘గోల్డెన్‌ జనరేషన్‌' పేరిట పిలుచుకుంటున్న ఈ జట్టులోని చాలామంది కీలక ఆటగాళ్లు 2022 టోర్నీలో కూడా ఆడే అవకాశం ఉంది. సెమీఫైనల్‌కు దూరమైన మ్యూనియర్‌ ఈ మ్యాచ్‌కు సిద్ధం కాగా హజార్డ్‌, ఫెల్లేని కీలకం కానున్నారు. 1986లో నాలుగో స్థానంలో నిలిచిన బెల్జియం జట్టు ఈసారి టాప్‌-3పై కన్నేసింది.

జట్ల అంచనా:

బెల్జియం: తియబత్ కౌర్టియోస్(గోల్‌కీపర్), జాన్ వెర్టోన్‌గెన్, విన్సెంట్ కొంపెనీ, టాబీ ఆల్డర్‌వీరెల్డ్, అక్సెల్ విట్సెల్, కెవిన్ డిబ్రుయెన్, నాసర్ చాడ్లీ, థామస్ మ్యునియర్, మౌరోనె ఫెల్లానీ, ఈడెన్ హజార్డ్, రోమెలు లుకాకు.

ఇంగ్లాండ్: జోర్డన్ పిక్‌ఫోర్డ్(గోల్‌కీపర్), కైల్ వాల్కర్, జాన్ స్టోన్స్, హ్యారీ మాగ్యురె, ట్రెంట్ అలెగ్జాండర్, ఆర్నాల్డ్ రూబెన్, ఎరిక్ డైయర్, జెస్సీ లింగార్డ్, అశ్లే యంగ్, రహీమ్ స్టెర్లింగ్, హ్యారీ కేన్.

లైవ్: రాత్రి 7.30 గంటలకు, సోనీ టీవిలో

Story first published: Saturday, July 14, 2018, 10:33 [IST]
Other articles published on Jul 14, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X